ఫారెస్ట్ అధికారిణిపై దాడి కేసు: కాంగ్రెస్‌ నిజనిర్ధారణ కమిటీ అరెస్ట్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకున్నారు. అటవీ అధికారులపై దాడి జరిగిన కొత్త సార్సాల గ్రామానికి వెళ్తున్న నిజనిర్ధారణ కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ప్రభుత్వ అసమర్థత వల్లే దాడులు జరిగాయని ఆరోపించారు. అటవీ అధికారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జగ్గారెడ్డి తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించి గవర్నర్‌కు నివేదిక ఇస్తామన్నారు. తెలంగాణలో […]

ఫారెస్ట్ అధికారిణిపై దాడి కేసు: కాంగ్రెస్‌ నిజనిర్ధారణ కమిటీ అరెస్ట్‌
Follow us

|

Updated on: Jul 04, 2019 | 9:21 PM

ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకున్నారు. అటవీ అధికారులపై దాడి జరిగిన కొత్త సార్సాల గ్రామానికి వెళ్తున్న నిజనిర్ధారణ కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ప్రభుత్వ అసమర్థత వల్లే దాడులు జరిగాయని ఆరోపించారు.

అటవీ అధికారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జగ్గారెడ్డి తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించి గవర్నర్‌కు నివేదిక ఇస్తామన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని కాంగ్రెస్ నేతలు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. కాగజ్‌నగర్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, అటవీశాఖ అధికారి అనితపై దాడికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.