#India locked down చేతులెత్తి మొక్కుతం కేసీఆర్ సారూ.. మమ్మల్ని ఆదుకోండి

కరోనా నియంత్రణకు అత్యంత కఠిన మైన చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్థంభించి పోయింది. వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆర్థిక నష్టాలతో కునారిల్లిపోతున్నాయి. దాంతో వలస జీవుల పరిస్థితి దుర్బరంగా మారిపోయింది.

#India locked down చేతులెత్తి మొక్కుతం కేసీఆర్ సారూ.. మమ్మల్ని ఆదుకోండి
Follow us

|

Updated on: Mar 28, 2020 | 2:10 PM

Many telangana people stuck in Mumbai city: దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ప్రతీ ఒక్క భారతీయునిలో ఏదో ఒక ఆందోళనకు కారణమవుతోంది. కరోనా నియంత్రణకు అత్యంత కఠిన మైన చర్యలకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జనజీవనం గత వారం రోజులుగా పూర్తిగా స్థంభించి పోయింది. పదిహేను రోజులుగా దేశంలో వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆర్థిక నష్టాలతో కునారిల్లిపోతున్నాయి. దాంతో వలస జీవుల పరిస్థితి దుర్బరంగా మారిపోయింది.

సరిగ్గా ఇదే తరహాలో ముంబయి మహానగరంలో చిక్కుకుపోయిరు తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన పలువురు. ఈ రెండు జిల్లాలకు చెందిన 20 కుటుంబాలు ముంబయిలో చిక్కుకుపోయాయి. పొట్టకూటి కోసం వలస వెళ్లిన పేదలు లాక్‌డౌన్‌ కారణంగా పస్తులుంటున్నారు. బయటకు వెళ్లే పరిస్థితులు లేక, పూట గడవక నరకం అనుభవిస్తున్నారు.

ఒక్కో గదిలో 15 మందికిపైగా కాలం వెల్లదీస్తున్నారు. కరోనా బారిన పడకుండా తమను తాము రక్షించుకుంటూనే స్వగ్రామాలకు తమను చేర్చాలని చేతులెత్తి మొక్కుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నపాలు చేసుకుంటున్నారు. కరోనాతో కాకుండా తాము ఆకలితో చచ్చిపోయేలా ఉన్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ‘‘చేతులెత్తి మొక్కుతం కేసీఆర్ సారూ.. మమ్మల్ని మా ఊరికి తీసుకపొండి ’’ అంటూ వీడియోలు రికార్డు చేసి మరీ తెలుగు మీడియాకు పంపుతున్నారు.

దేశంలో లాక్ డౌన్ కారణంగా ఎక్కడ వున్న వలస కూలీలు అక్కడే వుండాలని, వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారిది ఏ రాష్ట్రం, ఏ భాష అన్న తేడా లేకుండా వసతి, భోజన సౌకర్యం కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా కోరినా, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ ‌షా స్వయంగా నిర్దేశించినా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. తెలంగాణ వంటి ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో వున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఆదుకుంటుంటే.. మహారాష్ట్రలో తెలంగాణ వారు ఇబ్బందులకు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వాల చొరవ మరింతగా పెరగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.