ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల భర్తీ… ఇంకా మిగిలిపోయిన 19,998 సీట్లు

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్లు భర్తీ అయినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ఇంజినీరింగ్‌ సీట్ల వివరాలను ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ అధికారులు శనివారం వెల్లడించారు.

ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల భర్తీ... ఇంకా మిగిలిపోయిన 19,998 సీట్లు
Follow us

|

Updated on: Oct 24, 2020 | 6:11 PM

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్లు భర్తీ అయినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ఇంజినీరింగ్‌ సీట్ల వివరాలను ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ అధికారులు శనివారం వెల్లడించారు. తొలి విడుత 71.49 శాతం ఇంజినీరింగ్‌ సీట్లు భర్తీ అయ్యాయని, ఇంకా 19,998 సీట్లు మిగిలాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీ కళాశాలల్లో 98.5 శాతం మేర 3,091 సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 164 ప్రైవేట్‌ కళాశాలల్లో 47,046 బీటెక్‌ సీట్లు కేటాయింపు పూర్తి అయ్యిందన్నారు. 13 యూనివర్సిటీలు, 35 ప్రైవేట్‌ కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి.

మూడు ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. బీటెక్‌లోని 21 కోర్సుల్లో సీట్లన్నీ నిండాయి. బీఫార్మసీ, ఎంపీసీ కోటాలో కేవలం 4.02 శాతం సీట్లు మాత్రమే భర్తీ కాగా 4,324 సీట్లు మిగిలాయి. సీట్లు అలార్ట్ అయిన విద్యార్థులు ఈ నెల 28లోగా అయా కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ సూచించారు. ఈ నెల 29 నుంచి తుది విడుత ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుంటే, ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజ్‌ తొలగించేందుకు యోచిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం అంగీకరిస్తే కేవలం ఎంసెట్‌ మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25శాతం వెయిటేజ్‌ కేటాయిస్తున్నారు.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..