హైదరాబాద్‌లో వైద్యులను వెంటాడుతున్న వైరస్..68 డాక్టర్లకు పాజిటివ్

తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. సాధారణ ప్రజలు, వైద్యులు అనే తేడా లేకుండా అందరినీ భయపెడుతోంది. రాష్ట్రంలో కరోనా బారిన పడిన డాక్టర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు

హైదరాబాద్‌లో వైద్యులను వెంటాడుతున్న వైరస్..68 డాక్టర్లకు పాజిటివ్
Doctors
Follow us

|

Updated on: Jun 06, 2020 | 11:54 AM

తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. సాధారణ ప్రజలు, వైద్యులు అనే తేడా లేకుండా అందరినీ భయపెడుతోంది. రాష్ట్రంలో కరోనా బారిన పడిన డాక్టర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఉస్మానియాలో41 మంది డాక్టర్లు, గాంధీలో నలుగురు డాక్టర్లు కరోనా బారినపడ్డారు. నిమ్స్‌లో 12 మంది డాక్టర్లు, 8 మంది పారమెడికల్ స్టాఫ్ కరోనా బారినపడ్డారు. అలాగే డెంటల్ విద్యార్థులు ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం 68 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు కూడా కరోనా బారిన పడుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

ఇదిలా ఉంటే తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడం వల్లనే కరోనా వైరస్ కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు లాక్‌డౌన్ సమయంలో ఏప్రిల్ 9 నుంచి మే 5 వరకు 418 కేసులు మాత్రమే రాష్ట్రంలో నమోదవ్వగా.. లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చిన మే 6 నుంచి జూన్ 4వరకు 1830 కరోనా కేసులు నమోదయ్యాయి. అటు తొలి విడత లాక్‌డౌన్‌లో 396, రెండో విడత లాక్‌డౌన్‌లో 418 కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. ఇక జూన్ 8 నుంచి రాష్ట్రంలో మరిన్ని సడలింపులు అమల్లోకి రానున్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఏ స్థాయిలో పెరిగుతుందోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.