Breaking News
  • హైదరాబాద్‌: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ దాష్టీకం. విద్యార్థిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం. ప్రిన్సిపాల్‌ను నిలదీసిన విద్యార్థి తల్లిదండ్రులు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండని దురుసుప్రవర్తన. ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణం కులంపేరుతో దూషిస్తూ.. చితకబాదుతున్నాడని కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు.
  • ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ. విచారణకు హాజరుకాని తెలంగాణ పీసీబీ అధికారులు . తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా . పర్యావరణ అనుమతుల విషయంలో పీసీబీ అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న పిటిషనర్‌ హయాతుద్దీన్‌.
  • ఢిల్లీ: 2020-21 వార్షిక బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభం. ఆర్థికశాఖ కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక. బడ్జెట్‌ ప్రతుల ముద్రణ సందర్భంగా హల్వా వేడుక ఆనవాయితీ. హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థికశాఖ కార్యదర్శులు.
  • ప.గో: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని బీజేపీ నినాదం-మాణిక్యాలరావు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి టీడీపీ మాట్లాడుతోంది. ఐదు కోట్ల ఆంధ్రుల తరపున బీజేపీ-జనసేన పోరాడుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోంది-మాణిక్యాలరావు.
  • సిద్దిపేట: గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌ మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోనుంది. 2 వేల వార్డులు గెలుస్తామంటున్న బీజేపీకి.. గజ్వేల్‌లోని 20 వార్డుల్లో ఏ ఒక్క వార్డు గెలవలేరు-హరీష్‌రావు. 20 వార్డులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి-హరీష్‌రావు.

అమ్మాయిల మిస్సింగ్.. ఏమిటీ మిస్టరీ..?

, అమ్మాయిల మిస్సింగ్.. ఏమిటీ మిస్టరీ..?

అమ్మాయిలు మిస్సింగ్ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిల కిడ్నాపులు జరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేదు. చిన్నా పెద్దా తేడా లేదు. హైదరాబాద్ నగర శివారుల్లో మిస్సింగ్ కేసులు రోజు రోజుకి ఎక్కువై పోతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాదిలో 500 మందికి పైగా కనిపించకుండా పోయారని పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా పఠాన్‌చెరులో ఒకే రోజు ముగ్గురు అమ్మాయిలు కనిపించడకుండా పోవడం కలకలం రేపుతోంది. మిస్సైన వారిలో ఇద్దరు ఇంటర్ విద్యార్థినిలు, ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉన్నారు. కాలేజీకి వెళుతున్నామని చెప్పిన ఇద్దరు అమ్మాయిలు, ఇంటర్వ్యూకి వెళుతున్నానని చెప్పిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కనిపించకుండా పోయారు. అయితే భద్రత కల్పించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారంటూ పలు వార్తా పత్రికల్లో, టీవీ ఛానళ్లలో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మహిళలు, అమ్మాయిలు తప్పిపోతున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని చెప్పారు. ఈ మిస్సింగ్‌ కేసుల్లో చాలా వరకు కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, పరీక్షలు తప్పడం లాంటి వివిధ కారణాలతో ఇంటిని విడిచిపెట్టి వెళ్లిన వారే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకూ నమోదైన అన్ని మిస్సింగ్ కేసుల్లో 85 శాతానికి పైగా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన కేసుల పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాల ద్వారా ప్రజలను భయాందోళనలకు గురిచేసే అసత్య ప్రచారాలు చేయోద్దని.. అలాంటి ప్రచారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.