బక్రీద్‌ సందర్భంగా, గోవులను వధించవద్దు : మహమూద్‌ అలీ

బక్రీద్‌ సందర్భంగా గోవులను వధించవద్దని తెలంగాణ డిఫ్యూటి సీఎం మహమూద్‌ అలీ ముస్లింలకు పిలుపునిచ్చారు.

బక్రీద్‌ సందర్భంగా, గోవులను వధించవద్దు : మహమూద్‌ అలీ
Follow us

|

Updated on: Jul 26, 2020 | 12:22 AM

బక్రీద్‌ సందర్భంగా గోవులను వధించవద్దని తెలంగాణ డిఫ్యూటి సీఎం మహమూద్‌ అలీ ముస్లింలకు పిలుపునిచ్చారు. బక్రీద్‌ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ మ‌హేందర్‌రెడ్డితో ఆయన రివ్యూ మీటింగ్ నిర్వ‌హించారు. తెలంగాణలో అన్ని మతాలను గౌరవించుకునే సంస్కారం ఉంద‌ని, ఇదే తరహాలో బక్రీద్‌ను జరుపుకొందామని విజ్ఞప్తి చేశారు. చార్మినార్‌లోని 4 మినార్లను హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్‌లకు సంకేత‌మ‌న్నారు. అన్ని కులాల‌ను, మతాలను సమానంగా గౌరవించుకుందామని మహమూద్‌ అలీ సూచించారు. వ్యర్థాలను రోడ్డు, వీధుల్లో పారవేయ‌కుండా, పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని భౌతికదూరం పాటించ‌డంతో పాటు, మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని మహమూద్‌ అలీ కోరారు.