కొత్త సీఎస్‌కు చుక్కలు చూపించిన జనం

తెలంగాణ కొత్త చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్‌కు పాలమూరు జనం గురువారం చుక్కలు చూపించారు. జిల్లా పర్యటనకు వెళ్ళిన సోమేశ్ కుమార్‌ను రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామస్తులు అడ్డుకున్నారు. కాలుష్య కారక పరిశ్రమలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం తొలి రోజు కార్యక్రమాలలో పాల్గొనేందుకుగాను మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం వెళ్ళారు. కాలుష్య కారక […]

కొత్త సీఎస్‌కు చుక్కలు చూపించిన జనం
Follow us

|

Updated on: Jan 02, 2020 | 2:57 PM

తెలంగాణ కొత్త చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్‌కు పాలమూరు జనం గురువారం చుక్కలు చూపించారు. జిల్లా పర్యటనకు వెళ్ళిన సోమేశ్ కుమార్‌ను రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామస్తులు అడ్డుకున్నారు. కాలుష్య కారక పరిశ్రమలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్లె ప్రగతి కార్యక్రమం తొలి రోజు కార్యక్రమాలలో పాల్గొనేందుకుగాను మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం వెళ్ళారు. కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవడం లేదంటూ సీఎస్ పర్యటనలో నిరసన తెలిపారు గ్రామస్తులు. గ్రామస్తుల డిమాండ్ మేరకు రంగారెడ్డి గూడ గ్రామంలోని వీధుల్లో కలియ తిరిగారు సీఎస్. గ్రౌండ్ లెవల్ పరిస్థితిని ఆయన పరిశీలించారు.

పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో తమ గ్రామంలో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని, చాలా మంది రోగాల బారిన పడుతున్నారని గ్రామస్తులు ఈ సందర్భంగా సీఎస్ ద‌ృష్టికి తెచ్చారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించినన సోమేశ్ కుమార్ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్‌ని ఆదేశించారు. దాంతో పల్లె ప్రగతి సజావుగా కొనసాగింది.