పనుల్లో వేగం పెంచండి..మేడారం ఏర్పాట్లపై సీఎస్ జోషీ సమీక్ష

రానున్నఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అధికారులతో సమీక్షించారు. లక్షలాదిగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా జాతన ఏర్పాట్ల పనుల పురోగతిపై ఆయా శాఖల అధికారులను సీఎస్.. జోషి అడిగి తెలుసుకున్నారు. జాతరకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్, బస్సు సర్వీసులు, ట్రాఫిక్ నిర్వహణ, అగ్నిమాపక చర్యలు, మంచినీరు, […]

పనుల్లో వేగం పెంచండి..మేడారం ఏర్పాట్లపై  సీఎస్ జోషీ సమీక్ష
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 5:21 PM

రానున్నఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అధికారులతో సమీక్షించారు. లక్షలాదిగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా జాతన ఏర్పాట్ల పనుల పురోగతిపై ఆయా శాఖల అధికారులను సీఎస్.. జోషి అడిగి తెలుసుకున్నారు. జాతరకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్, బస్సు సర్వీసులు, ట్రాఫిక్ నిర్వహణ, అగ్నిమాపక చర్యలు, మంచినీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్యం వంటి ప్రధాన అంశాలపై సీఎస్ సమీక్షించారు.

ప్రతి విభాగానికి ఇప్పటికే కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగిస్తూ అనుకున్న సమయం కంటే ముందుగానే ప్రణాళికా బద్ధంగా పనులు పూర్తిచేయాలని సీఎస్ ఆదేశించారు. మేడారం జాతరకు సంబంధించి వచ్చే పదేళ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. దాదాపు కోటిమంది భక్తులు రానున్న ఈ జాతరకు కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. ఈ నేపధ్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ పర్యావరణాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. గత ఏర్పాట్లలో జరిగిన లోపాలు ఈసారి పునరావృతం కానివ్వొద్దంటూ సీఎస్ ఆదేశించారు.

మేడారం జాతరకు సంబంధించిన పనులను డిసెంబర్ నాటికే పూర్తి చేయాలని అందుకు ప్రణాళికా బద్దంగా, అన్ని విభాగాలను కలుపుకుని పోవాలన్నారు. అదేవిధంగా జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచాలని ఆయా శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.