ప్రభుత్వ లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు

అనారోగ్యంతో కన్నుమూసిన తెలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి (86) అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నాం మహా ప్రస్థానంలో జరుగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

  • Balaraju Goud
  • Publish Date - 9:13 am, Thu, 22 October 20

అనారోగ్యంతో కన్నుమూసిన తెలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి (86) అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నాం మహా ప్రస్థానంలో జరుగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి 12:25 గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. నాయిని అంత్యక్రియలు నేడు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రస్తుతం మినిస్టర్ క్వార్టర్స్‌కు నాయిని భౌతిక కాయాన్ని తరలించారు. ఇవాళ మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

సెప్టెంబరు 28న కరోనా సోకడంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నాయిని చేరారు. కరోనా తగ్గిన తర్వాత మళ్లీ ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స తీసుకుంటూనే కన్నుమూశారు. బుధవారం అర్ధరాత్రి ఆయన మృతి చెందిన విషయం తెలిసి కార్మికులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.