కరోనా లాక్‌డౌన్‌: పోలీసుల వీక్ ఆఫ్‌లపై హైదరాబాద్ సీపీ కీలక నిర్ణయం..!

లాక్‌డౌన్ కారణంగా విధుల్లో ఉన్న సిబ్బందికి వీక్ ఆఫ్‌లపై హైదరాబాద్ సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రొటేషన్ పద్ధతిలో వీక్ ఆఫ్ ఇవ్వాలని హైదరాబాద్ సీపీ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా లాక్‌డౌన్‌: పోలీసుల వీక్ ఆఫ్‌లపై హైదరాబాద్ సీపీ కీలక నిర్ణయం..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 12, 2020 | 8:03 PM

లాక్‌డౌన్ కారణంగా విధుల్లో ఉన్న సిబ్బందికి వీక్ ఆఫ్‌లపై హైదరాబాద్ సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రొటేషన్ పద్ధతిలో వీక్ ఆఫ్ ఇవ్వాలని హైదరాబాద్ సీపీ నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిది వారాలుగా రోడ్లపై నిరంతర డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ సిబ్బందికి వీక్ ఆఫ్ అమలు చేయాలని సీపీ ఆదేశించారు. రొటేషన్ పద్ధతిలో సిబ్బందికి డే ఆఫ్ ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా కరోనా వైరస్ లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి పోలీస్ సిబ్బంది విశ్రాంతి లేకుండా తమ డ్యూటీ చేస్తోన్న విషయం తెలిసిందే. తమ ప్రాణాలు, ఎండను  సైతం లెక్కచేయకుండా దేశవ్యాప్తంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసేందుకు వారు శ్రమిస్తున్నారు.

Read This Story Also: రానా లవర్ మిహీకా బజాజ్ ఎవరో తెలుసా..! ఆమె గురించిన ఆసక్తికర విషయాలు..!