తెలంగాణలో కొత్తగా 1,456 మందికి కరోనా

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా పాజిటివ్ కేసులతో పాటు రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతుండటం కొంత ఊరట కలిగిస్తోంది.

  • Balaraju Goud
  • Publish Date - 8:54 am, Thu, 22 October 20

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా పాజిటివ్ కేసులతో పాటు రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతుండటం కొంత ఊరట కలిగిస్తోంది. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1,456 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,27,580కి చేరుకుందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనా బారినపడి ఐదుగురు ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,292కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,717 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,06,105కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,183 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 16,977 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 39,78,869 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.