తెలంగాణలో కొత్తగా 127 కరోనా కేసులు..!

తెలంగాణ‌లో రోజు రోజుకీ క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంటల్లో 127 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,020కి చేరింది.

తెలంగాణలో కొత్తగా 127 కరోనా కేసులు..!
Follow us

|

Updated on: Jun 03, 2020 | 8:48 PM

తెలంగాణ‌లో రోజు రోజుకీ క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంటల్లో 127 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై బుధవారం రాత్రి 8 గంట‌ల‌కు బులిటెన్ విడుద‌ల చేసింది ఆరోగ్య శాఖ‌. రాష్ట్రంలో మంగళవారం సాయం‌త్రం ఐదు గంట‌ల నుంచి బుధవారం సాయంత్రం ఐదు గంట‌ల మ‌ధ్య న‌మోదైన కొవిడ్-19 కేసుల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఈ 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రానికి చెందిన‌ లోక‌ల్స్ లో 125 మందికి, మ‌రో ఇద్దరు వ‌ల‌స కార్మికుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3020కి చేరింది. ఇందులో స్థానికులు 2572 మంది, విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన‌వారు, వ‌ల‌స కూలీలు 448 మంది ఉన్నారు. గ‌డిచిన 24 గంటల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీలో 108 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. రంగారెడ్డి జిల్లాలో 6, అసిఫాబాద్ జిల్లాలో 6, మేడ్చ‌ల్ జిల్లాలో 2, సిరిసిల్ల జిల్లాలో 2, యాదాద్రి , కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో ఒక్కొక్క కేసు చొప్పున న‌మోద‌య్యాయి. కరోనాతో బుధవారం ఒక్కరు కూడా చనిపోలేదని తెలిపిన ఆరోగ్య శాఖ.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 99కు చేరింది. ఇక 1556 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ప్ర‌స్తుతం 1365 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.