సహకార ఎన్నికల్లో దాడులు..వెంటపడి మరీ

తెలంగాణలో సహకార సంఘం ఎన్నికలు పలు చోట్ల ఉద్రిక్తంగా మారాయి. నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌గా వార్‌ నడిచింది. అటు సిద్ధిపేట జిల్లా జగదేవపూర్‌లో రెండు వర్గాలుగా చీలిపోయిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. నిజామాబాద్ సహకార సంఘం ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. బోధన్‌ మండలం హున్సాలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీంది. సింగిల్‌ విండో చైర్మన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు గొడవపడ్డారు. ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం రాళ్లు […]

సహకార ఎన్నికల్లో దాడులు..వెంటపడి మరీ
Follow us

|

Updated on: Feb 16, 2020 | 3:01 PM

తెలంగాణలో సహకార సంఘం ఎన్నికలు పలు చోట్ల ఉద్రిక్తంగా మారాయి. నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌గా వార్‌ నడిచింది. అటు సిద్ధిపేట జిల్లా జగదేవపూర్‌లో రెండు వర్గాలుగా చీలిపోయిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు.

నిజామాబాద్ సహకార సంఘం ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. బోధన్‌ మండలం హున్సాలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీంది. సింగిల్‌ విండో చైర్మన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు గొడవపడ్డారు. ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. దీంతో గ్రామంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.

సిద్దిపేట జిల్లాలోనూ సహకార సంఘం ఎన్నికలు ఉద్రిక్తతలకు దారితీశాయి. జగదేవపూర్‌లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చైర్మన్‌ పదవి కోసం రెండువర్గాలుగా చీలిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడులకు దిగారు. ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ ఏర్పాడింది. ఈ వివాదంలో శ్రీనివాస్‌రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.

అటు సిరిసిల్లలోనూ సహకార సంఘం ఎన్నికల్లో ఘర్షణ తలెత్తింది. సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామంలో డైరెక్టర్‌ స్థానాలు 13 ఉండగా 6 టీఆర్‌ఎస్‌, బీజేపీ కైవసం చేసుకున్నాయి. ఈ రోజు ఉదయం చైర్మన్‌ ఎన్నికలు జరిగే సమయంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య వాగ్వాదం నెలకొంది. బీజేపీ కార్యకర్తలను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బలవంతంగా ఓట్లు వేయించుకుంటున్నారని ఆరోపించారు. ఇరువర్గాల మధ్య ముదిరిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.