భవన నిర్మాణ కార్మికులకు రూ.10వేల ఆర్థిక సాయం ఇవ్వాలి..

కరోనా, లాక్‌డౌన్ కారణంగా నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న భవననిర్మాణ కూలీలు, కార్మికులను ఆదుకోవాలని..రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల యూనియన్‌...

భవన నిర్మాణ కార్మికులకు రూ.10వేల ఆర్థిక సాయం ఇవ్వాలి..
Follow us

|

Updated on: Jul 01, 2020 | 1:40 PM

కరోనా, లాక్‌డౌన్ కారణంగా నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న భవననిర్మాణ కూలీలు, కార్మికులను ఆదుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లాక్‌డౌన్ వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి రూ.10 వేల చొప్పున అందించి ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల యూనియన్‌ నేతలు కోరారు.

ఈ మేరకు రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల యూనియన్‌ నేతలు కార్మిక శాఖ కమిషనర్‌ను కలిశారు. నిర్మాణ బోర్డు నుంచి నిధులను కార్మికులకు అందించాలని కోరుతూ వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని గతంలోనే సుప్రీం కోర్టు సూచించినట్లు వారు ఈ సందర్భంగా  గుర్తు చేశారు. కార్మిక సంక్షేమ నిధి కోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న 8 లక్షల 50వేల మంది కార్మికులతో పాటు నమోదు చేసుకొను వారు కూడా చాలా మంది ఉన్నారని వారు వాపోయారు. లబ్ధిదారులైన కార్మికులను గుర్తించిన వారికి కూడా ఆర్థిక సహాయం అందించాలకోరారు. ప్రభుత్వం తమ వినతికి సానుకూలంగా స్పందింస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.