రాష్ట్రంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్.. కొత్త రథసారథి కోసం మొదలైన అన్వేషణ..!

జిహెచ్ఎంసి ఫలితాలు కాంగ్రెస్ దిబ్బ తిరిగే ఫలితాలను ఇచ్చాయి. గతంలో అత్యధిక స్థానాలతో మేయర్ పీఠం సొంతం చేసుకున్న పార్టీ తాజా రిజల్ట్స్‌లో రెండు స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితిలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీని కొత్త నాయకుడు అవసరం ఏర్పడింది.

రాష్ట్రంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్.. కొత్త రథసారథి కోసం మొదలైన అన్వేషణ..!
Follow us

|

Updated on: Dec 05, 2020 | 1:54 PM

జిహెచ్ఎంసి ఫలితాలు కాంగ్రెస్ దిబ్బ తిరిగే ఫలితాలను ఇచ్చాయి. గతంలో అత్యధిక స్థానాలతో మేయర్ పీఠం సొంతం చేసుకున్న పార్టీ తాజా రిజల్ట్స్‌లో రెండు స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితిలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీని కొత్త నాయకుడు అవసరం ఏర్పడింది. రాష్ట్రంలో మూడవ స్థానానికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ కొత్త రథసారథి కోసం అప్పడే అన్వేషణ మొదలైంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటున్నా.. ఆస్థాయిలో ప్రజల వద్దకు చేరలేకపోయింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఆ స్థాయిలో మెప్పించలేక పోయింది. కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఎప్పుడో అక్యూపై చేసింది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని మొన్న జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల నిన్న జరిగిన జిహెచ్ఎంసి ఫలితాలు ఇందుకు నిదర్శనం.

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం వేగంగా మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. హూజుర్‌నగర్ ఉప ఎన్నికల తర్వాత టీపీసీసీ మార్పు ఉంటుందనే ప్రచారం సాగింది. ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల షాక్‌తో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బలమైన నాయకుడు అవసరం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. జరిగిన పరిణామాలు, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టిఆర్ఎస్ ని ఢీకొనే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్న సంకేతాలు వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి భారీగా వలసలు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకుడు వేటలో కాంగ్రెస్ అధిష్టానం పడింది

అయితే, గతంలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తాడన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో చాలా మంది ఆశావహులు ఆ పదవి కోసం పోటీ పడ్డారు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి జానారెడ్డి పేర్లు కూడా వినిపించాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి పార్లమెంటు సమావేశాల సమయంలో సోనియాగాంధీని కలిసి ప్రెసిడెంట్ పదవి కోసం లాబీంగ్ కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా ఆయనకు అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్‌లో మోస్ట్ సీనియర్ నేత జానారెడ్డి కూడా టీపీసీసీ వరించే అవకాశం కూడా కనిపిస్తోంది. గతంలోనే జానారెడ్డికి ఇస్తారు అన్నా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది ప్రశ్నగా మారింది. ఇటు అధికార టీఆర్ఎస్, మెల్లగా రెండు స్థానానికి బాకిన బీజేపీలను ధీటుగా ఎదుర్కొనే నాయకుడు అవసరం మాత్రం ఉందంటున్నారు పార్టీ శ్రేణులు.

మరోవైపు, పీసీసీ పీఠంపై కన్నేసిన ఎంతోమంది సీనియర్ నేతలు ఇందుకోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాగా, ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎవరిని రెఫర్ చేస్తారో అన్న దాని పైన కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పొన్నం ప్రభాకర్ , వి. హనుమంతరావు పేర్లు ఇందులో వినిపిస్తున్నాయి. తాను పీసీసీ ప్రెసిడెంట్ గా పని చేస్తున్న తరుణంలో తనకు సపోర్ట్ చేసిన పార్టీకి అండగా ఉన్న వీరి పేర్లను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి తెలియజేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసి ఎన్నికలు ముగిసిన వెంటనే పీసీసీ మార్పు ఉంటుందని ఆలోచనతోనే పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బిసి నాయకులు ఓ అడుగు ముందుకేసి, అప్పడే, మీటింగ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈసారి తమకు సంబంధించిన వారికే ఇవ్వాలని కూడా ఒక తీర్మానం చేసినట్లుగా తెలుస్తోంది.

ఇదిలావుంటే, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తే మేము కూడా పార్టీ నుంచి వీడుతారనే సంకేతాలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇస్తున్న పరిస్థితి కనిపించింది. ఇన్ని రోజులుగా పార్టీని అంటిపెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి మాత్రమే టీపీసీసీ పదవి ఇవ్వాలని సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇకపై కలసికట్టుగా ఉంటున్నామని చెబుతూనే అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని అంటూనే, మరోవైపు ఎవరికివారు సొంతంగా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు

వీటన్నింటిపైనా లెక్కలు వేసుకుని కొత్తగా వచ్చిన ఇన్‌చార్జ్ అందరితో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అనంతరం నివేదిక తెప్పించుకున్న తర్వాత ఈ నెల 9 వరకూ కొత్త టీపీసీసీ ప్రెసిడెంట్ ను ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది.