జగన్ నిర్ణయాలు అభినందనీయం- జీవన్ రెడ్డి

కరీంనగర్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రోజుకో కొత్త నిర్ణయంతో ఏపీ సీఎం రాజకీయ దురందురల అభినందనలు అందుకుంటున్నారు. ఫిరాయింపుల గురించి ఏపీ అసెంబ్లీ ప్రకటన చేసిన జగన్‌ను టీ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభినందించారు. వయసులో చిన్నవాడైనా జగన్ ప్రజాజీవితంలో ఓ రోల్‌ మోడలని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ను చూసైనా తెలంగాణ సీఎం కేసీఆర్‌ మేల్కోవాలని హితవు పలికారు. ఏపీ ముఖ్యమంత్రిని తెలంగాణకు స్వాగతిస్తున్న కేసీఆర్‌, పార్టీ ఫిరాయింపులపై పునరాలోచించాలని కోరారు.

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షం బలహీనమైతే నష్టపోయేది పాలకపక్షమేనని అన్నారు. తెలంగాణలో గడిచిన ఐదేళ్లలో విద్యా వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. విద్యాహక్కు చట్టం అమలు కావడం లేదని తెలిపారు. ఏపీలో విద్యాహక్కు చట్టం అమలు చేయడంతోపాటు పిల్లలను బడికి పంపించే తల్లుల అకౌంట్లో రూ.15 వేలు డబ్బులు వేయడం అభినందనీయమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *