కాంగ్రెస్ కు భారీ షాక్… టీఆర్ఎస్ లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు

తెలంగాణలో మరోసారి ఫిరాయింపుల పర్వం మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై విజయం సాధించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులు పార్టీని వీడనున్నారు. ఇవాళ వీరిద్దరూ కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా అధికారికంగా ప్రకటించారు. తాము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలను కూడా గాంధీభవన్‌కు […]

కాంగ్రెస్ కు భారీ షాక్... టీఆర్ఎస్ లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు
Follow us

| Edited By:

Updated on: Mar 03, 2019 | 8:30 AM

తెలంగాణలో మరోసారి ఫిరాయింపుల పర్వం మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై విజయం సాధించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులు పార్టీని వీడనున్నారు. ఇవాళ వీరిద్దరూ కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా అధికారికంగా ప్రకటించారు. తాము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలను కూడా గాంధీభవన్‌కు పంపించామని.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తామని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించారు. 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు గెలిచింది. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు వీడనుండడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 17కి పడిపోయింది.

కాగా, రానున్న ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఐదు స్థానాలనూ తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపగా, దాదాపు 10 మంది వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరవచ్చని తెలుస్తోంది. ఒక ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవడానికి 21 మంది ఎమ్మెల్యేలు అవసరం. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ సీట్లు వస్తాయి. అయితే, ఐదో అభ్యర్థిని కూడా టీఆర్ఎస్ బరిలోకి దింపింది. అయితే, కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరు నారాయణరెడ్డిని బరిలోకి దించారు. తమకు ఉన్న ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే ఒక్క సీటు గెలుచుకోవచ్చని హస్తం నేతలు అంచనా వేశారు. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు జారిపోవడంతో ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలుచుకోవడం కష్టమే అంటున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి) సైతం శనివారం కేసీఆర్ ను కలిశారు. ఆయన కూడా కారు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.