టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం..

టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనమైంది. దీనికి సబంధించి అసెంబ్లీ కార్యదర్శి బులిటెన్ విడుదల చేశారు. సీఎల్పీని విలీనం చేయాలని కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు ఇవాళ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. దానిపై సానుకూలంగా స్పందించి.. టీఆర్‌ఎస్‌లో సీఎల్పీని విలీనం చేశారు. సీఎల్పీ విలీనంపై శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు బులిటెన్ జారీ చేశారు. రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ ప్రకారం విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో శాసనసభలో టీఆర్‌ఎస్ బలం 102 కు చేరింది. […]

టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం..
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2019 | 8:03 PM

టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనమైంది. దీనికి సబంధించి అసెంబ్లీ కార్యదర్శి బులిటెన్ విడుదల చేశారు. సీఎల్పీని విలీనం చేయాలని కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు ఇవాళ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. దానిపై సానుకూలంగా స్పందించి.. టీఆర్‌ఎస్‌లో సీఎల్పీని విలీనం చేశారు. సీఎల్పీ విలీనంపై శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు బులిటెన్ జారీ చేశారు. రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ ప్రకారం విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో శాసనసభలో టీఆర్‌ఎస్ బలం 102 కు చేరింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు పడిపోయింది. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది.