Breaking News
  • హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో లో సహాయక చర్యల నిమిత్తం తమ ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాలని హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ నెంబర్ ల నిర్ణయం దీంతోపాటు తమకు వచ్చే నాలుగు నెలల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి అందించనున్న కంటోన్మెంట్ బోర్డు సభ్యులు ఈ మేరకు ఒక లేఖ ని పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు కి అందించారు.
  • తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పంటలు బాగా పండి వ్యవసాయం గొప్పగా వర్థిల్లాలని, ప్రతీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లి విరిసేలా దీవించాలని అమ్మవారిని ముఖ్యమంత్రి ప్రార్థించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని కోరారు.
  • అమరావతి: విశాఖ కాపులుప్పుడులో ప్రభుత్వ స్థలం పేదలకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు. విశాఖ కాపులపాడు లో 20 ఎకరాలు పేదలకు ఇళ్ళు స్థలలుగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు. ఇదంతా బౌద్ధిని స్తూపం ఉన్న చారిత్రాత్మక ప్రదేశమని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కొత్తపల్లి వెంకట రమణ. ప్రభుత్వం పురావస్తు చట్టం మరియు పర్యావరణ చట్టం లోని నిబంధనలు కీ వ్యతిరేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించారన్న పిటిషనర్. దీనిపై విచారణ జరిపి స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు.
  • మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జలమండలి సంప్ లు శుభ్రపర్చలని నిర్ణయం. ఇంటింటికీ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలు. మంత్రి ఆదేశాల మేరకు పంపిణీ చేయనున్న జలమండలి. ఇటీవలి భారీ వర్షాల కారణంగా ఇంటి నిల్వ సంప్‌ వర్షపు నీటితో కలిసి ఉంటే, మీ సంపులు, ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రపరచాలని ప్రకటన. జలమండలి సరఫరా నీటితో నింపుకుని ఆ నీటిలో క్లోరిన్ మాత్రలను కలిపి నీటిని వాడాలని సూచన. ఇంటికి ఒక కిలో బ్లీచింగ్ పౌడర్, నీటితో కలపడానికి క్లోరిన్ మాత్రలను పంపిణీ చేస్తోంది. ఇతర వివరాలకు జల మండలి కస్టమర్ కేర్ 155313 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు.
  • పండగల సందర్భంగా మెట్రో ప్రయాణికులకు చార్జీల్లో రాయితీ ప్రకటించిన మెట్రో. రేపటి నుంచి ఈనెలాఖరు వరకు ఈ కింది రాయితీ వర్తింపు . మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం రాయితీ . స్మార్ట్ కార్డు ద్వారా 14 ట్రిప్పుల చార్జీతో ... 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం . 20 ట్రిప్పుల చార్జీతో ... 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం . 40 ట్రిప్పుల చార్జీతో ... 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం . టీ సవారీ మొబైల్ అప్లికేషన్ ద్వారా నవంబర్ 1 తేదీ నుంచి ఈ ఆఫర్ అమలు . 7 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం. 14 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం . 20 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం . 30 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 45 రోజుల్లో45 ట్రిప్పులు తిరిగే అవకాశం . 40 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం.
  • పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి రఘురామకృష్ణ రాజుకు ఉద్వాసన. రఘురామకృష్ణరాజు స్థానంలో వైకాపా ఎంపీ బాలశౌరికి అవకాశం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేచర్ కి చైర్మన్ గా వ్యవహరించిన రఘురామకృష్ణరాజు. అక్టోబర్ 9 నుంచే మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని లోక్ సభ సచివాలయం.
  • కృష్ణా: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ . తమిళనాడుకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసిన గుడివాడ పోలీసులు . లారీలో లోడులను దొంగిలిస్తున్నట్టు తెలిపిన ఎస్పీ రవీంద్రబాబు. రూ.3 లక్షలు విలువ చేసే11 సిగరెట్ డబ్బాలు స్వాధీనం . పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నాం- ఎస్పీ రవీంద్రబాబు.

రంగంలోకి రాములమ్మ

Telangana congress leader vijayashanti questions to CM kcr government flood effect in hyderabad, రంగంలోకి రాములమ్మ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి టీఆర్ఎస్ సర్కారు పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. మూడు వరుస ట్వీట్లలో సీఎం కేసీఆర్ పరిపాలనా తీరుతెన్నులను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ” వానలు తగ్గినా రోజుల తరబడి కాలనీలకు కాలనీలు నీళ్ళల్లోనే నానుతుండటం… కేసీఆర్ సర్కారు పాలనా పగ్గాలు అందుకున్న మొదటి, మలి విడతల పరిపాలనా కాలంలో ఈ పరిస్థితుల నుంచి పౌరులను రక్షించేందుకు ఏ పరిష్కారాలు చూపించారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. టీఆరెస్ అధికారంలోకి రాకముందే ఎన్నెన్నో చెరువుల దురాక్రమణ, భూముల కబ్జాలు… అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయని కేసీఆర్ పదే పదే అన్నారు. కానీ, జరిగిందేమిటి? మీరైనా ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వెయ్యగలిగారా? మీ నిర్వహణ ఏ తీరున ఉందో జలగండంలో చిక్కుకున్న మీ కలల విశ్వనగరాన్ని చూస్తే చాలు. మొత్తంగా చూస్తే పాలకవర్గం తప్ప మరే వర్గమూ ప్రశాంతంగా లేని పరిస్థితులు నేడు తెలంగాణలో నెలకొన్నాయి. కేసీఆర్ దొరగారు పరిపాలనను అటకెక్కించి టీఆరెస్ గెలుపు కోసం పూర్తిగా దుబ్బాక ఉపఎన్నిక పైనే దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని గ్రహించడం మంచిది.” అంటూ రాములమ్మ టీఆర్ఎస్ సర్కారుపై ప్రశ్నలు కురిపించారు.

Telangana congress leader vijayashanti questions to CM kcr government flood effect in hyderabad, రంగంలోకి రాములమ్మ

Related Tags