Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

జగ్గారెడ్డి పొలిటికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ చూస్తారా..?

జగ్గారెడ్డి.. సంగారెడ్డి ఎమ్మెల్యే.. ఇయన రూటే సెపరేటు. కాంగ్రెస్లో మాస్ లీడర్‌గా పేరొందిన ఈయన.. ఇటీవల వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ఎప్పుడు ఏం చేస్తారో.. ఏం అంటారో తెలియకుండా పోయింది. రోజుకో స్టైల్లో ఆయన రాజకీయం కొనసాగుతోంది. అప్పుడే అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు. మళ్లీ మరుసటి రోజే.. రివర్స్ గేర్ వేసి.. పొగడతారు. బద్ధశత్రువుగా ఉన్న అధికార పార్టీ నేతపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఆయనతోనే మళ్లీ మీట్ అవ్వడం.. ఇది ప్రస్తుతం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీరు. అసలు ఆయన రూటేంటి. ప్రతిపక్షంలో ఉండి ఇన్ని రకాలుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు. పార్టీ అధికారంలో లేదని అలా వ్యవహరిస్తున్నారా? లేక పార్టీ జంపింగ్ ప్లాన్లు ఏమైనా ఉన్నాయా? మొత్తానికి జగ్గారెడ్డి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సంగారెడ్డిలో బలమైన నేత జగ్గారెడ్డి. అంతేకాదు.. కాంగ్రెస్‌లో మాస్ లీడర్ కూడా ఇయనే. కానీ ఇప్పుడు ఆయన వ్యవహారమే గాంధీభవన్‌ నుంచి సంగారెడ్డి వరకు చర్చ జరుగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. ఒకప్పుడు సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యేవారు. ఆ తర్వాత రెండో సారి టీఆర్ఎస్ అధికారం చేపట్టాక.. జగ్గారెడ్డి దూకుడులో మార్పులు వచ్చాయి. ఒకరోజు సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తారు. వెంటనే మరోరోజు కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతారు. ఒకసారి హరీష్ రావు పైనా ఫైర్ అవుతారు. మళ్లీ టైమ్‌ దొరకగానే ఆయనకు సన్మానం చేస్తారు.

తాజాగా సేమ్ ఇలాంటి సీన్ మళ్లీ రిపీట్ చేశారు. గత 19రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొని.. కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత అరెస్టు కూడా అయ్యారు. కార్మికుల పట్ల మొండివైఖరి విడనాడాలంటూ ప్రభుత్వానికి సూచనలు కూడా చేశారు. అంతేకాదు.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో కూడా పాల్గొని.. ఏకంగా ప్రగతి భవన్ వద్దకు ఆటోలో చేరుకుని అరెస్ట్ అయ్యారు. ఇదంతా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పోషించిన పాత్రగా అనుకోవచ్చు.

అయితే ఇంతలోనే మళ్లీ తన ట్యూన్ ఛేంజ్ చేశారు. ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం అయ్యి.. 24 గంటలు గడిచిందో లేదో మళ్లీ కేసీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే సంగారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. దీంతో ఏకంగా కేసీఆర్ ఫోటో పక్కన తన ఫోటో వేసుకొని సంగారెడ్డిలో కరపత్రాలు పంపిణీ చేశారు.

అసలు జగ్గారెడ్డి స్టాండ్ ఏంటో అర్ధం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారట. ఒకవైపు పోరాటం.. కార్మికులకు సంఘీభావం.. మరోవైపు కేసీఆర్‌ని పొగడ్తల్లో ముంచెత్తడం.. అసలు జగ్గారెడ్డి ప్లాన్‌ ఏంటి? ఇప్పుడు ఈ విషయం సంగారెడ్డిలో చర్చనీయాంశమైంది. అంతేకాదు.. ఇంతకీ ఆయన కాంగ్రెస్‌లో కొనసాగుతారా లేదా కారెక్కి.. టీఆర్ఎస్‌ కండువా కప్పుకుంటారా..? అన్నది ఎవరికీ అంతుపట్టడంలేదు. మొత్తానికి జగ్గారెడ్డి రోజుకో పొలిటికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను.. పబ్లిక్‌కు చూపిస్తున్నారని సెటైర్లు విసురుతున్నారు.