ఎగ్జిట్ పోల్స్ గోల.. హస్తం డీలా!

సార్వత్రిక ఎన్నికలతో తెలంగాణాలో తమ పరిస్థితి మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఖచ్చితంగా మూడు లేదా నాలుగు ఎంపీ స్థానాలు గెలుస్తామని అనుకున్నారు. అటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్ని టీ-కాంగ్రెస్‌కు సున్నా వేశాయి. దీంతో ఒక్కసారిగా డీలాపడిపోయారు టీ- కాంగ్రెస్ పెద్దలు. ఇకపోతే టీ- కాంగ్రెస్ ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉంది.. అధికారం మాదే అంటూ […]

ఎగ్జిట్ పోల్స్ గోల.. హస్తం డీలా!
Follow us

|

Updated on: May 22, 2019 | 9:52 AM

సార్వత్రిక ఎన్నికలతో తెలంగాణాలో తమ పరిస్థితి మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఖచ్చితంగా మూడు లేదా నాలుగు ఎంపీ స్థానాలు గెలుస్తామని అనుకున్నారు. అటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్ని టీ-కాంగ్రెస్‌కు సున్నా వేశాయి. దీంతో ఒక్కసారిగా డీలాపడిపోయారు టీ- కాంగ్రెస్ పెద్దలు. ఇకపోతే టీ- కాంగ్రెస్ ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉంది.. అధికారం మాదే అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో సమరం చేస్తే గెలిచింది కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా ఓడిపోతే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్‌లోకి జంప్ చేస్తారని వారు ఆందోళన చెందుతున్నారు.