గవర్నర్ సౌందర్ రాజన్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.. సీఎంతో పాటు..

మంగళవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆమెకు విషెస్ చెప్పారు. ఇవాళ ఉదయాన్నే సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్ తమిళిసైకి జన్మదిన శుభాకాంక్షలు...

గవర్నర్ సౌందర్ రాజన్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.. సీఎంతో పాటు..
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2020 | 3:01 PM

మంగళవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆమెకు విషెస్ చెప్పారు. ఇవాళ ఉదయాన్నే సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్ తమిళిసైకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. పుష్పగుచ్ఛం ఇచ్చి గవర్నర్‌కు అభినందనలు తెలియజేశారు. పూర్తి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని ఆకాంక్షించారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళిసై. తన పుట్టిన రోజు, టీఎస్ రాష్ర్ట అవతరణ దినోత్సవం ఒకే రోజు కావడం ఆనందంగా ఉందన్నారు.

కాగా ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తెలంగాణ రాష్ట్ర అవతరణకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. భారత స్వాతంత్యం తర్వాత.. అంత సుధీర్ఘకాలం జరిగిన ఉద్యమంగా ‘తెలంగాణ ఉద్యమం’ చరిత్రలో నిలుస్తుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారన్నారు సీఎం. వారి త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని.. గవర్నర్‌కు వివరించారు కేసీఆర్. కాగా సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, కేఆర్ సురేశ్ రెడ్డి, పలువురు ప్రభుత్వాధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు కూడా గవర్నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా తమిళంలో కూడా విషెస్ చెబుతూ ట్విట్ చేశారు చిరంజీవి. అలాగే తెలంగాణ ప్రజలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బెస్ట్ విషెస్ అందజేశారు.

ఇవి కూడా చదవండి:

షాకింగ్ న్యూస్: కన్న కూతుర్నే నరబలి ఇచ్చిన దుర్మార్గపు తండ్రి

ప్రముఖ రచయిత జొన్న విత్తులపై ఎస్సీ, ఎస్టీ కేసు..

బ్రేకింగ్: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా

సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కి అడ్డుతగిలిన యువకుడు