సీఎం కేసీఆర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్న దత్తపుత్రిక

సవతి తల్లి చేతిలో చిత్ర హింసలకు గురై, బంగారు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిన ప్రత్యూష ఇప్పుడేం చేస్తోంది. తానే పరిస్థితిలో ఉంది. అవును కదా.. ఆమె తెలుసుకోవాలని ఉంది కదూ..! అయితే, తనకు పునర్జన్మనిచ్చిన సీఎం కేసీఆర్ ను కృతజ్ఞతలు చెప్పకోవాలని ఎదురుచూస్తోంది.

సీఎం కేసీఆర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్న దత్తపుత్రిక
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 12, 2020 | 3:43 PM

సవతి తల్లి చేతిలో చిత్ర హింసలకు గురై, బంగారు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిన ప్రత్యూష ఇప్పుడేం చేస్తోంది. తానే పరిస్థితిలో ఉంది. అవును కదా.. ఆమె తెలుసుకోవాలని ఉంది కదూ..! అయితే, తనకు పునర్జన్మనిచ్చిన సీఎం కేసీఆర్ ను కృతజ్ఞతలు చెప్పకోవాలని ఎదురుచూస్తోంది.

అప్పట్లో సంచలన సృష్టించిన ప్రత్యూష ఇప్పుడు నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఖైరతాబాద్ నర్సింగ్ కళాశాలలో పనిచేస్తోంది. 2015 సంవత్సరంలో సవతి తల్లి పెట్టిన చిత్రహింసలు చలించిపోయిన పలు స్వచ్ఛందసంస్థలు రాకాసి సవతి తల్లి చేర నుండి విడిపించారు. అయితే, ఆ సమయంలో ఈమె గురించి తెలుసుకొని ప్రత్యూషను చేరదీసి మరీ, తన ఇంట్లో రెండు రోజులు ఆశ్రయం కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు. తాను కోరుకున్న విధంగా తన జీవితాన్ని మల్చుకునే సదావకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు.

కేసీఆర్ తన దత్త పుత్రిక నర్సింగ్ కోర్సు చేస్తోందన్న సమాచారంతో సీఎం ఆనందం వ్యక్తంచేశారు. అయితే, గతంలో ఒక సారి ఈమె అబ్బాయిని ప్రేమించిందని అతనినే పెళ్లి చేసుకోవడానికి ఆమె సిద్ధపడినట్లు కేసీఆర్ అనుమతి కూడా ఆమె తీసుకోనున్నట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. అయితే, కేసీఆర్ ఆ అమ్మాయికి నచ్చిన విధంగా చదివించడం మాత్రమే కాకుండా మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి కూడా జరిపిస్తానని ఆమెను దత్తత తీసుకున్న రోజు ఆయన ప్రకటించడం జరిగిందని అప్పట్లో వార్తల్లో వచ్చింది.

కానీ, తర్వాత ఈమెకు సంబంధించిన ఏ సమాచారం కూడా బయటకు పొక్కలేదు. తాజాగా కేసీఆర్ తన దత్త పుత్రిక ఎలా ఉందో ఆరా తీయమని అధికారులను కోరగా మళ్లీ ఆమె వార్తల్లోకి వచ్చింది. తనకు పునర్జన్మనిచ్చిన తండ్రి ముఖ్యమంత్రిని కలుసుకోవాలని ఉందని ప్రత్యూష తెలిపింది. ఇందుకోసం పలుమార్లు ప్రగతి భవన్ లో సంప్రదించినా సరియైన సమాధానం లభించలేదట. కానీ తన బాగోగులు సీఎం కేసీఆర్ తెలుసుకుంటున్నారని, తనకు కావల్సిన అన్ని సదుపాయాలను సీఎం కార్యాలయ సిబ్బంది సమకూరుస్తున్నారని ప్రత్యూష తెలిపింది. సిఎం సూచనల మేరకు సిఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.5 లక్షలు, నష్టపరిహారం రూపంలో రూ.2.50 లక్షల నగదుతో పాటు తన పేరు మీద ఒక ఇల్లు రిజిస్టర్ అయిందని తెలిపిన ప్రత్యూష్, ఇంటి అద్దె మొత్తం ఫిక్స్ డిపాజిట్లు చేసినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తెలిపారని ప్రత్యూష చెప్పారు.

అయితే, తనకు ఇంతటి జీవితాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు చెప్పకోవాలని భావిస్తోంది ప్రత్యూష. సీఎం నుంచి వచ్చే ఫోన్ కాల్ కోసం ప్రత్యూష ఆశగా ఎదురుచూస్తోంది. కనీసం మాజీ ఎంపీ కవితనైనా కలుసుకునే అవకాశం ఇవ్వాలని ప్రత్యూష కోరుతోంది.