త్వరలో తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. వేటు పడేది వీరిపైనే !!

Telangana cabinet reshuffle, త్వరలో తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. వేటు పడేది వీరిపైనే !!

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేసిన జాప్యం అంతా ఇంతా కాదు. దాదాపు ఆరు నెలల తర్వాత పూర్తి స్థాయి కేబినెట్ ని ఏర్పాటు చేసుకున్నారు కెసిఆర్. అయితే మొత్తం బెర్తులన్నీ నిండిన నేపథ్యంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఇక ఇప్పట్లో ఉండదు అన్న నిర్ధారణకు చాల మంది వచ్చేసారు. కానీ సీన్ మాత్రమే వేరేలా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. బడ్జెట్ సెషన్ ముందుండడం.. అప్పటికే చాల జాప్యం జరగడం వాళ్ళ ఎవరినీ నొప్పించకుండా.. వీలైనంతగా కుల, మత సమీకరణాలు చూసుకుని.. ఎలాంటి అసమ్మతులు, అసంతృప్తులు లేకుండా అత్యంత వ్యూహాత్మకంగా కెసిఆర్ కేబినెట్ విస్తరణని పూర్తి చేశారు. అనుకున్నట్టుగానే బడ్జెట్ సెషన్ ప్రశాంతంగా ముగించుకోబోతున్నారు. అయితే కేబినెట్ విస్తరణ అంశం ఇక క్లోజ్ అయినట్టే అనుకునే వారికీ కెసిఆర్ షాక్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. దసరా తర్వాత కేబినెట్ లో తీసివేతలు, కూడికలు ఉండబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా. అయితే ఈ సారి వేటు పడే వారి సంఖ్య దాదాపు 8 వరకు ఉంటుందని తెలుస్తోంది. అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి తో కలిపి ఉన్న 18 మంత్రుల నుంచి ఎనిమిది మందికి ఉద్వాసన పలికి వారి స్థానంలో మరో ఎనిమిది మందికి అవకాశం ఇచ్చేందుకు కెసిఆర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల మంత్రి వర్గ విస్తరణకు ముందు ఈటల రాజేందర్ వాటి నేతలపై వేటు పడడం ఖాయం అన్న సంకేతాలు రావడం, దాంతో అయన వ్యూహాత్మకంగా కొన్ని కామెంట్లు చేయడం.. దానికి తెలంగాణ వ్యాప్తంగా భారీ స్పందన రావడం తెలిసిందే. అయితే కెసిఆర్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించి తీసివేతలు లేకుండా, ఔత్సాహికులలో అత్యంత ముఖ్యులకు పదవులిస్తూ కేబినెట్ విస్తరణ తంతుని ముగించారు. బడ్జెట్ పై పూర్తి కసరత్తు తానే స్వయంగా పూర్తి చేసిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ బాధ్యతలను హరీష్ రావు కు అప్పగించారు. అంటే బడ్జెట్లో ఏముందో తెలియకుండానే ఆర్థిక మంత్రి హరీష్ రావు శాసన మండలిలో బడ్జెట్ ప్రసంగాన్ని చదవాల్సి వచ్చింది. కెసిఆర్ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో శాసన సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేనంత చిన్న ప్రసంగంతో సభ ముందుకు బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన ఘనత కెసిఆర్ ది.

Telangana cabinet reshuffle, త్వరలో తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. వేటు పడేది వీరిపైనే !!

ఇదిలా ఉంటే ఆదివారంతో తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగుస్తున్నాయి. ఆ తరువాత బతుకుమ్మ వేడుకలు, దసరా నవరాత్రులు, విజయదశమి ఉత్సవాలు పూర్తి అవుతూనే కేబినెట్ ని పునర్వ్యవస్థీకరించాలని కెసిఆర్ భావిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అయితే సీఎం కోటరీలోనే మరో వర్గం మాత్రం ఆరు నెలల వరకు కేబినెట్లో మార్పులు, చేర్పులపై కెసిఆర్ దృష్టి పెట్టరు అని వాదిస్తోంది. కానీ, విశ్వసనీయ వర్గాల కథనమే ప్రకారం.. దసరా తర్వాత కేబినెట్ నుంచి ఆరు నుంచి ఎనిమిది మందికి ఉద్వాసన పలికి.. వారి స్థానాల్లో తగిన వారికీ అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. ఒకే సారి అంత మందిని పదవి నుంచి తొలగిస్తే రగిలే అసమ్మతిని, అసంతృప్తిని చల్లార్చేందుకు కెసిఆర్ దగ్గర మరో వ్యూహం రెడీ గా ఉందని తెలుస్తోంది. ఇది వరకు ప్రయోగించి కోర్టు అభ్యంతర పెట్టడంతో మరుగున పడేసిన “పార్లమెంటరీ సెక్రటరీ” పదవులను మరోసారి సృష్టించడం ద్వారా అసంతృప్త నేతలు బుజ్జగించేందుకు కెసిఆర్ రెడీ అవుతున్నారు. ఆరు నుంచి ఎనిమిది మంది పార్లమెంటరీ సెక్రటరీలను నియమించేందుకు కెసిఆర్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. దీనికి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు కెసిఆర్ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్రెడీ పార్లమెంటరీ సెక్రటరీల నియామకంపై శాసన సభ ఆమోదం తీసుకున్న నేపథ్యంలో ఈసారి న్యాయ పరమైన చిక్కులు రావని కెసిఆర్ భావిస్తున్నట్టు సమాచారం. సో.. దసరా తర్వాత తెలంగాణాలో పొలిటికల్ హీట్ ఖాయంగా కనిపిస్తోంది. కెసిఆర్ మదిని గ్రహించిన కొందరు నేతలు ఆయన గుడ్ లుక్స్ లో ఉండేందుకు, కేటీఆర్ లాంటి కీలక నేతలను ప్రసన్నం చేసుకునేందుకుకే ఇప్పట్నుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. లెట్ అజ్ సీ హూ అర్ లక్కీ లీడర్స్ !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *