వర౦గల్ రాజకీయ వర్గాల్లో ఉత్క౦ఠ‌

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో, ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి పలువురు ఆశావహులు ఉండటంతో కేసీఆర్‌ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి రేపుతోంది. మంత్రిగా సుదీర్ఘ అనుభవం గడించిన కడియం శ్రీహరి, అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు మెజారిటీ సాధించిన అరూరి రమేశ్,  ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రత్యేకతను సొంతం చేసుకున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, నాలుగు సార్లు గెలిచిన వినయ్‌భాస్కర్‌, ఆరు సార్లు గెలిచిన రెడ్యానాయక్‌  మంత్రి పదవి రేసులో ఉన్నారు. వీరిలో కడియం ఎమ్మెల్సీగా […]

వర౦గల్ రాజకీయ వర్గాల్లో ఉత్క౦ఠ‌
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 9:21 PM

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో, ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి పలువురు ఆశావహులు ఉండటంతో కేసీఆర్‌ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి రేపుతోంది. మంత్రిగా సుదీర్ఘ అనుభవం గడించిన కడియం శ్రీహరి, అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు మెజారిటీ సాధించిన అరూరి రమేశ్,  ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రత్యేకతను సొంతం చేసుకున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, నాలుగు సార్లు గెలిచిన వినయ్‌భాస్కర్‌, ఆరు సార్లు గెలిచిన రెడ్యానాయక్‌  మంత్రి పదవి రేసులో ఉన్నారు. వీరిలో కడియం ఎమ్మెల్సీగా ఉండగా, మిగతా ముగ్గురూ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆశావహులు నలుగురిలో ఎర్రబెల్లికి బెర్త్‌ ఖాయమని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.