మరికొద్ది గంటల్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

Telangana cabinet expansion second time in RajBhavan, మరికొద్ది గంటల్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఆదివారం దశమి కావడంతో ఈ రోజే మంత్రివర్గ విస్తరణకు అనుకూలంగా ఉంటుందని సీఎం కేసీఆర్ భావించారు. ఈ సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. కొత్త మంత్రులతో రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలంటూ చీఫ్ సెక్రెటరీ ఎస్.కే. జోషిని ఆదేశించారు.

కొత్త మంత్రులతో నూతన గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. తొలిసారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేయగా, ఫిబ్రవరి 19న 10 మంత్రులతో కేబినెట్ కొలువుదీరింది. తాజాగా ఇవాళ మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిపేందుకు సర్వం సిద్ధమైంది. అయితే ఈసారి ఎంతమందికి ఛాన్స్ లభిస్తుందో అనేది ఉత్కంఠగా మారింది.

అయితే తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం జరిగినే నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆమె చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేసేలా ప్రణాళిక రెడీ చేయడంతో మంత్రి పదవుల విషయంలో ఎవరూ పైరవీలు చేసే వీలు లేకపోయిందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *