తెలంగాణ అసెంబ్లీ: బడ్జెట్‌పై చర్చ

Telangana budget 2019 live updates, తెలంగాణ అసెంబ్లీ: బడ్జెట్‌పై చర్చ

ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. నేడు ఉభయ సభల్లో బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. మండలిలో చర్చను ప్రారంభించనున్న ఎమ్మెల్సీ పురాణం సతీష్. సివిల్ కోర్టు చట్ట సవరణ.. బిల్లును ప్రవేశపెట్టనున్న ఇంద్రకరణ్ రెడ్డి.

కాగా.. ఈ సారి.. తెలంగాణలో తీవ్ర ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆచితూచి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. మాంద్యం ఉన్నా… సంక్షేమానికి ఢోకా లేని విధంగా నిధులు కేటాయించింది. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌యేతర నిధులను వినియోగించాలని నిర్ణయించింది. ఆశించిన ఆదాయం కన్నా తక్కువ ఉండటం వల్లే గత ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఇప్పటికి చాలా తేడా ఉందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌. మొత్తం లక్షా 46 వేల 492 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి. రెవెన్యూ వ్యయం లక్షా 11వేల 55 కోట్లుగా ప్రతిపాదించారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ కొంత నయంగా ఉందని చెప్పారు సీఎం కేసీఆర్‌.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *