కోవిడ్ ఫ్రీ కోసం..ఆవులతో సహవాసం చేస్తున్న యువకుడు

ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి ‘కరోనా వైరస్’. ప్రస్తుతం ఈ వైరస్ నివారణకు అవసరమైన ఔషదం తయారీలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. మందులేని మాయదారి రోగాన్ని తరిమికొట్టేందుకు..

కోవిడ్ ఫ్రీ కోసం..ఆవులతో సహవాసం చేస్తున్న యువకుడు
Follow us

|

Updated on: Oct 05, 2020 | 6:35 PM

ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి ‘కరోనా వైరస్’. ప్రస్తుతం ఈ వైరస్ నివారణకు అవసరమైన ఔషదం తయారీలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. మందులేని మాయదారి రోగాన్ని తరిమికొట్టేందుకు ప్రజలంతా మాస్క్‌లు వాడుతున్నారు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుకుంటూ..శానిటైజర్ వాడుతూ..భౌతిక దూరం పాటించాలనే నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తున్నారు. కానీ పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ యువకుడు మాత్రం కరోనా వైరస్ మొదలై ఆరు నెలలు గడుస్తున్నా ముఖానికి ఎప్పుడూ మాస్క్ పెట్టుకోలేదు. చేతులకి శానిటైజర్ రాయలేదట.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన పల్లె సతీష్ అనే యువరైతుకు ఐదు ఆవులున్నాయి. నిత్యం ఆవుల మధ్య సహవాసం చేస్తూ ఎక్కువ సమయం ఆవులతోనే గడుపుతున్నాడు. ఆవుల వద్ద ఉంటే సర్వరోగాలు నయమవుతాయని, కరోనా వైరస్ కూడా దరిచేరదని సతీష్ నమ్మకం. ఆ నమ్మకంతోనే తాను ఇంతకాలం మాస్క్ లేకుండా, శానిటైజర్ వాడకుండానే కోవిడ్ వైరస్‌కు చిక్కకుండా ఉంటున్నామని అంటున్నాడు. ఆవులు ఆక్సిజన్ తీసుకుని, మళ్లీ ఆక్సిజన్‌నే వదులుతాయని పురాణాల్లో చదివానని సతీష్‌ అంటున్నారు. అందుకే ఆవుల దగ్గర ఉన్నవారికి కరోనా వైరస్ దరిచేరదని నమ్ముతున్నాడు సతీష్.

ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా ఆవులకి శుభ్రంగా స్నానం చేయించి, పసుపు కుంకుమలతో పూలమాలలు వేసి, అందంగా అలంకరించి, గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. సతీష్ ను చూసి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఆవులను పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆవుల చెంత ఉంటే కరోనా దరిచేరదని స్థానికులు కూడా గట్టిగా నమ్ముతున్నారు.