Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • మర్డర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు. వెంకటేశ్వరరావు డిఎస్పి మిర్యాలగూడ.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • విశాఖ: డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్ పోలీస్ రోడ్ పై నిలబడి సేవచేయాలంటే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులు విధినిర్బహణలో ఉన్నారు లాక్ డౌన్ సమయంలో ఫారెన్ రిటర్నీస్ ను సమర్ధంగా కట్టడిచేయగలిగాం -కంటైన్మెంట్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేయగలిగాం వైరస్ పై ఇంకా అవగాహన పెరగాలి.. అందరూ మాస్క్ ధరించాలని చెబుతున్నాం.. అవగాహన పెంచుతున్నాం
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

కేసీఆర్ టార్గెట్‌గా బిజెపి యాక్షన్ ప్లాన్.. వివరాలు తెలిస్తే షాక్

telangana bjp eyes gajwel, కేసీఆర్ టార్గెట్‌గా బిజెపి యాక్షన్ ప్లాన్.. వివరాలు తెలిస్తే షాక్

రాష్ట్రంలో 119 సీట్లు. ఆల్‌మోస్ట్ అన్ని చోట్లా పోటీకి దిగితే.. మొన్నటి ఎన్నికల్లో 103 సీట్లలో డిపాజిట్‌ గల్లంతు. కానీ తెలంగాణ గడ్డపై జెండా ఎగుర వేయాలి. కమలం సత్తా చాటాలి. ఇందు కోసం ఏం చేయాలి? అని మథనం చేస్తే… బిజెపి నేతలకు ఓ రూట్‌ దొరికిందట. కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్లు….అసలు సీటుపైనే కమలం గురిపెట్టిందట. అక్కడ నుంచి గేమ్ స్టార్ట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఇంతకీ కమలం అసలు టార్గెట్‌ ఏంటి?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌. ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోట. అయితే ఈ గడ్డ ఇప్పుడు గులాబీ అడ్డా అయింది. గజ్వేల్‌లో తిరుగులేని మెజార్టీతో కేసీఆర్‌ రెండు సార్లు గెలిచారు. గజ్వేల్‌ను అన్ని రకాలు అభివృద్ధి చేస్తున్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి…..ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవి ఇచ్చారు. దీంతో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్‌ బాధ్యతలను నర్సారెడ్డి చూస్తున్నారు. ఆయనకు ఇప్పుడు వల వేయాలనే ప్లాన్‌లో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.

నర్సారెడ్డి గతంలో కాంగ్రెస్‌లో ఉండేవారు. 2009లో గజ్వేల్‌ నుంచి గెలిచారు. టీఆర్‌ఎస్‌‌లో చేరి కీలక నేతగా నియోజకవర్గంలో పనిచేశారు. అయితే 2018 ఎన్నికల ముందు పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని….గులాబీకి గుడ్‌ బై చెప్పి మళ్లీ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు.

గజ్వేల్‌లో గత ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. మహిళా నేత ఆకుల విజయ అభ్యర్థిగా నిలిచారు. కానీ చెప్పుకోదగ్గ ఓట్లు సంపాదించలేదు. తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ సీఎం నియోజకవర్గంపై కన్నేసిందట. ఇక్కడ బలమైన అభ్యర్థి కోసం చాలా రోజులుగా వెతుకుతుంది. ఇందులో భాగంగా ఇప్పుడు నర్సారెడ్డికి గాలం వేయాలనేది కమలనాథుల ప్లాన్‌. ఆయన్ని పార్టీలోకి లాగాలని చర్చలు జరుపుతున్నారట. అయితే డిసెంబర్‌లో కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత ఈయన చేరిక ఫైనల్‌ అవుతుందని నాంపల్లి బీజేపీ ఆఫీసులో గుసగుస విన్పిస్తోంది.

Related Tags