తెలంగాణ అసెంబ్లీలో రెండు కీలక బిల్లులు.. కొత్త మున్సిపల్ చట్టానికి పదును

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ, రేపు జరిగే ఈ సమావేశాల్లో పలు బిల్లులపై చర్చించనున్నారు. ముందుగా కొత్త మున్సిపల్ చట్టం బిల్లును సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు. అయితే సాయంత్రం వరకూ బిల్లుపై ప్రభుత్వం సవరణలు స్వీకరించనుంది. ఇక ఈ బిల్లుపై రేపటి సభలో చర్చ జరపనున్నారు. అలాగే మెడికల్ కాలేజీ లెక్చరర్ల పదవీ విరమణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు కావాలంటే సీనియారిటీ ప్రకారం రావాల్సి ఉంటుందని.. ఈ […]

తెలంగాణ అసెంబ్లీలో రెండు కీలక బిల్లులు.. కొత్త మున్సిపల్ చట్టానికి పదును
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2019 | 12:26 PM

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ, రేపు జరిగే ఈ సమావేశాల్లో పలు బిల్లులపై చర్చించనున్నారు. ముందుగా కొత్త మున్సిపల్ చట్టం బిల్లును సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు. అయితే సాయంత్రం వరకూ బిల్లుపై ప్రభుత్వం సవరణలు స్వీకరించనుంది. ఇక ఈ బిల్లుపై రేపటి సభలో చర్చ జరపనున్నారు. అలాగే మెడికల్ కాలేజీ లెక్చరర్ల పదవీ విరమణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు కావాలంటే సీనియారిటీ ప్రకారం రావాల్సి ఉంటుందని.. ఈ నేపథ్యంలోనే వారి వయోపరిమితిని పెంచుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. అంతేకాకుండా ప్రొపెసర్లు లేక ప్రతీ సంవత్సరం మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య తగ్గిస్తూ వస్తున్నారని అలాంటి పరిస్థితి ఇకపై రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా తక్కువ వ్యవధిలో పాలనలో ఎన్నో సంస్కరణలు చేపట్టామని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్తగా మరో ఏడు కార్పొరేషన్లను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. వైద్య విద్యార్థులు పోస్టుల భర్తీ కోసం ఎదురుచేస్తున్నారని.. వెంటనే పోస్టులను భర్తీ చేయాలని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క కోరారు. కాగా, టీఆర్‌ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం పై కేసీఆర్ స్పందిస్తూ.. రాజ్యాంగబద్దంగానే విలీనం జరిగిందని ఆయన చెప్పారు.