తెలంగాణ శాసనభలో 4 సవరణ బిల్లులకు ఆమోదం

తెలంగాణ శాస‌న‌స‌భ పలు కీల‌క బిల్లుల‌కు ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లుల‌ను స‌భ‌లో ఆయా శాఖ‌ల మంత్రులు ప్ర‌వేశ‌పెట్టారు.

తెలంగాణ శాసనభలో 4 సవరణ బిల్లులకు ఆమోదం
Follow us

|

Updated on: Oct 13, 2020 | 4:29 PM

తెలంగాణ శాస‌న‌స‌భ పలు కీల‌క బిల్లుల‌కు ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లుల‌ను స‌భ‌లో ఆయా శాఖ‌ల మంత్రులు ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం బిల్లులపై చ‌ర్చించి.. స‌భ్యుల అనుమానాలను నివృత్తి చేశారు మంత్రులు. అనంత‌రం ఈ నాలుగు బిల్లుల‌ను ఆమోదిస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు స్పీకర్.

ఇండియ‌న్ స్టాంప్ బిల్లు తెలంగాణ‌ 2020, తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్- 2020ను శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. జీహెచ్ఎంసీ స‌వ‌ర‌ణ బిల్లు-2020ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు – 2020ను న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శాసనసభలో ప్ర‌వేశ‌పెట్టారు.

స‌భ‌లో ఆమోదం పొందిన బిల్లులుః

1. ఇండియన్ స్టాంప్ బిల్లు (తెలంగాణ) 2020ః 

  • భూముల ప్రాథమిక విలువ నిర్ధరణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు 47ఏ కింద విచక్షణాధికారాలను తొలగిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేశారు.

2. తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు(కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)- 2020ః

  • వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా బదలాయించేందుకు అధికారులకు విచక్షణాధికారాలు రద్దు చేశారు.
  • ధరణి ద్వారానే ఆన్​లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేలా నాలా చట్టాన్ని సవరించారు.
  • వ్యవసాయేతర ఆస్తులకు కూడా గుర్తింపు సంఖ్య ఇచ్చేలా చట్టానికి సవరణలు చేశారు.

3. జీహెచ్ఎంసీ సవరణ బిల్లు – 2020ః

  • మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ స‌వ‌ర‌ణ చేశారు.
  • 10 శాతం గ్రీన్ బ‌డ్జెట్‌కు నిధుల కేటాయింపు.
  • 10 సంవ‌త్స‌రాలకు ఒక‌సారి రిజ‌ర్వేష‌న్ల మార్పున‌కు స‌వ‌ర‌ణ‌.
  • నాలుగు ర‌కాల వార్డు వాలంటీర్ల క‌మిటీల ఏర్పాటుకు స‌వ‌ర‌ణ‌.
  • ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌భుత్వాన్ని ఎస్ఈసీని సంప్ర‌దించాల‌ని చ‌ట్ట స‌వ‌ర‌ణ‌.

4. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు – 2020ః

  • హైకోర్టు సూచన మేరకు నిందితులకు పూచీకత్తు అంశానికి సంబంధించిన సీఆర్పీసీ చట్టాన్ని సవరించారు.

అయితే, ఇవాళ జరిగిన సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కొంత మంది హాజరు కాలేదు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొందేం వీరయ్య, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభకు హాజరు కాలేదు. ఇక బీజేపీ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా హాజరు కాలేదు. అధికార పర్టీ సహా, ఎంఐఎం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం తెలంగాణ శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా