ఈఎస్‌ఐ స్కాంలో మరో రూ.2.47 కోట్లు సీజ్‌

తెలంగాణ ఈఎస్‌ఐ స్కాం దర్యాప్తులో విస్తుబోయే నిజాలు బయటపడుతున్నాయి. తవ్వే కొద్ది పాపాల పుట్టలో "కట్టల"పాములు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఏసీబీ అధికారులు మరోసారి నిర్వహించిన సోదాల్లో 2 కోట్ల 47 లక్షలు రూపాయలు బయటపడ్డాయి.

ఈఎస్‌ఐ స్కాంలో మరో రూ.2.47 కోట్లు సీజ్‌
Follow us

|

Updated on: Sep 11, 2020 | 7:35 PM

తెలంగాణ ఈఎస్‌ఐ స్కాం దర్యాప్తులో విస్తుబోయే నిజాలు బయటపడుతున్నాయి. తవ్వే కొద్ది పాపాల పుట్టలో “కట్టల”పాములు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఏసీబీ అధికారులు మరోసారి నిర్వహించిన సోదాల్లో 2 కోట్ల 47 లక్షలు రూపాయలు బయటపడ్డాయి. ఇందులో దేవికారాణికి సంబంధించినవే కోటి 29 లక్షల రూపాయలు ఉన్నాయి. ఇక ఆమె బినామీల నుంచి రూ.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అటు- ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మి దగ్గర 35 లక్షలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ నేపథ్యంలో దేవికారాణిపై మరో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు . సైబరాబాద్‌లో కమర్షియల్‌ ప్రాపర్టీ కొనుగోలుకు ఆమె ప్రయత్నించినట్లు అధారాలు లభించడంతో అధికారులు దాడి చేసి ఈ సొమ్మును సీజ్ చేశారు. అందుకోసం బినామీల ద్వారా కోటీ 29 లక్షల రూపాయలను బదిలీ చేసింది దేవికారాణి. అయితే, దేవికారాణి వద్ద ఇంకెంత సొమ్ము ఉందన్న దానిపై కూడా ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. ఇంకా పెద్ద మొత్తంలో బినామీల పేరుతో నగదు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.