కిలాడీల స్కెచ్.. స్వీట్ బాక్స్‌లో కోటిన్నర విలువైన సౌదీ కరెన్సీ

Two held attempting to smuggle foreign currency at Hyderabad airport, కిలాడీల స్కెచ్.. స్వీట్ బాక్స్‌లో కోటిన్నర విలువైన సౌదీ కరెన్సీ

స్వీట్ బాక్స్‌లో కోటిన్నర రూపాయల విలువైన సౌదీ కరెన్సీని తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు అడ్డంగా దొరికిపోయాడు. శంషాబాద్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద ఉన్న లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేయగా.. స్వీట్ బాక్సులో దుబాయి కరెన్సీ బయటపడింది. నిందితులు 3.50 లక్షల సౌదీ రియాల్‌లను అక్రమంగా దుబాయికి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కరెన్సీ విలువ రూ. కోటిన్నరకు పైగా ఉంటుందని తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇండిగోకు చెందిన విమానంలో వీరిద్దరూ హైద్రాబాద్ నుంచి దుబాయ్ వెళ్లడానికి సిద్ధమైనట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *