కరీంనగర్‌కు 100 ప్రత్యేక వైద్య బృందాలు

కరీంనగర్‌లో ఏడు కరోనా కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. కరీంనగర్‌కు 100 ప్రత్యేక వైద్య బృందాలను...

కరీంనగర్‌కు 100 ప్రత్యేక వైద్య బృందాలు
Follow us

|

Updated on: Mar 19, 2020 | 11:14 AM

తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఒకే జిల్లాలో ఒకేసారి ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా వార్తలు రావటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కరీంనగర్‌లో ఏడు కరోనా కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. కరీంనగర్‌కు 100 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలు కరీంనగర్‌లో ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేయనున్నాయి. కరోనా పాజిటివ్‌ కేసులతో వైద్యశాఖ అప్రమత్తమైంది. కరీంనగర్‌లో 20 ఐసోలేషన్‌, 10 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లోని రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో అధికారులు 50 బెడ్లు సిద్ధం చేశారు.

కరీంనగర్‌లో ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారించారు. కరోనా పాజిటివ్‌ కేసులతో కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో హైఅలర్ట్‌ కొనసాగుతోంది.. ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌ వద్ద ఇండోనేషియా బృందం బస చేసిన ప్రాంతంలో అలర్ట్‌ అయ్యారు. కలెక్టరేట్‌ చుట్టూ 3 కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న రహదారిని మూసివేశారు. కరీంనగర్‌లో హోటళ్లు, దుకాణాలు బంద్‌ చేశారు. ప్రజలు బయటికి రావొద్దని కలెక్టర్‌ సూచించారు.

ఇవి కూడా చదవండి:ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో కరోనా పేషెంట్ !

ఇవి కూడా చదవండి:కరోనా మూడో దశకు ఆయుష్మాన్ భారత్ సిద్ధం