గంజాయి దమ్ము కొట్టి.. గాగ్రావేసుకుని.. తేజ్ ప్రతాప్ వేషాలపై భార్య పిటీషన్

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్‌ప్రతాప్ లీలలు ఒక్కక్కటీ బయటపడుతున్నాయి. తేజ్ ప్రతాప్ విచిత్ర ప్రవర్తనపై స్వయంగా ఆయన భార్య ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదుతో క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. బీహార్ మాజీ మంత్రిగా పనిచేసిన తేజ్ ప్రతాప్ ఓ విచిత్రమైన వ్యక్తి. రాధా, కృష్ణుడు, శివుడిలా తయారై అందర్ని ఆశ్చర్యపరుస్తుంటాడు. తనకు తానే దేవతామూర్తిని అనే భావన కలిగి ఉంటాడు. వీటన్నిటికీ తోడు డ్రగ్స్‌కు బానిస. అయితే ఇలాంటి వేషాలన్నీ గంజాయి దమ్ము […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:39 pm, Wed, 7 August 19
Telugu News

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్‌ప్రతాప్ లీలలు ఒక్కక్కటీ బయటపడుతున్నాయి. తేజ్ ప్రతాప్ విచిత్ర ప్రవర్తనపై స్వయంగా ఆయన భార్య ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదుతో క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. బీహార్ మాజీ మంత్రిగా పనిచేసిన తేజ్ ప్రతాప్ ఓ విచిత్రమైన వ్యక్తి. రాధా, కృష్ణుడు, శివుడిలా తయారై అందర్ని ఆశ్చర్యపరుస్తుంటాడు. తనకు తానే దేవతామూర్తిని అనే భావన కలిగి ఉంటాడు. వీటన్నిటికీ తోడు డ్రగ్స్‌కు బానిస. అయితే ఇలాంటి వేషాలన్నీ గంజాయి దమ్ము బాగా తలకెక్కిన తర్వాత వేస్తుంటాడని ఆయన భార్య ఐశ్వర్య కోర్టుకు తెలిపింది.

ఏడాది క్రితమే తేజ్ ప్రతాప్‌తో ఈమెకు వివాహమైంది. అయితే ఆరు నెలలకే ఆమెకు విడాకులివ్వడానికి తేజ్ సిద్ధపడ్డాడు. ఇదే విషయంపై కుటుంబంలో నిలదీసే సరికి ఎవరికీ కనిపించకుండా పోయాడు. దీంతో ఐశ్వర్య తన భర్త తేజ్ ప్రతాప్ విచిత్ర ప్రవర్తనపై ఫిర్యాదు చేస్తే తప్ప పూర్తి వివరాలు బయటికి రాలేదు. సెక్షన్ 26 ప్రకారం తనకు రక్షణ కల్పించాలని కుటుంబ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు ఐశ్వర్య. ఈ పిటీషన్‌లో పలు ఆసక్తికర అంశాలును వెల్లడించింది. గంజాయి కిక్కు బాగా ఎక్కిన తర్వాత గాగ్రచోళీ వేసుకుని రాధలా తయారుకావడం, అలాగే గంజాయి శివుని ప్రసాదం దాన్ని ఎలా వద్దంటాను? అంటూ దాన్ని ఫుల్‌గా తీసుకునే వాడట. తన భర్త విచిత్ర వేషాలపై స్వయంగా ఆమె ఫ్యామిలీ కోర్టుకు తెలిపి తనకు రక్షణ కల్పించాలని న్యాయస్ధానాన్ని వేడుకుంది తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్య.