అమెరికా స్కూల్లో పేలిన గన్.. విద్యార్థి మృతి.

అమెరికాలో మరోసారి తుపాకీల మోత మోగింది. కొలరాడో రాష్ట్రం డెన్వర్‌లోని ఓ పాఠశాలలోకి చొరబడిన ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. వీరిలో డెవన్, ఎరిక్ సన్ అనే 18 ఏళ్ల యువకుడి వివరాలను పోలీసులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్ల విద్వేషం పెంచుకున్న డెవన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిమాని అని, అతగాడు క్రిస్టియన్ల పట్ల కూడా తన ఫేస్ బుక్ పేజ్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని తెలిసిందని వారు చెప్పారు. కాగా.. ఈ కాల్పుల ఘటనతో ఈ పాఠశాలలోని ఇతర విద్యార్థులు, టీచర్లు భయాందోళన చెందారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఈ స్కూల్‌కు వచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లిపోయారు. పట్టుబడిన ఇద్దరు అనుమానితుల్లో ఒకరికి డ్రగ్స్ అలవాటు కూడా ఉన్నట్టు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *