డ్రస్ పొట్టిగా ఉందని.. ఆఫీసు నుంచి గెంటేశారు..

లండన్‌లోని వార్‌విక్‌ ఎస్టేట్స్‌ అనే కంపెనీలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. డ్రస్ పొట్టిగా వేసుకుందని ఓ యువతిని ఆఫీసు నుంచి ఇంటికి పంపించేశారు. ఇంగ్లాండ్‌లోని హాడ్డెస్‌డన్ హార్ట్‌ఫోర్డ్‌షెర్‌కు చెందిన లిల్లి క్యాటిల్ వార్ విక్ ఎస్టేట్స్ అనే కంపెనాలో జూనియర్ క్రెడిట్ కార్డ్ కంట్రోలర్‌గా పనిచేస్తోంది. రోజులాగే ఆఫీసుకు వెళ్లింది. ఆఫీసులో పనిచేసుకుంటుండగా హెచ్ ఆర్ టీమ్ సభ్యురాలు ఒకరు ఆమెను పిలిచి నీ స్కర్ట్ చాలా పొట్టిగా ఉంది. బాస్ నిన్ను ఇంటికి పంపమన్నారు […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:36 pm, Thu, 22 August 19
Teenage Girl In Tears After Bosses Sent Her Home From Work Placement Because Her Skirt Was Too Short

లండన్‌లోని వార్‌విక్‌ ఎస్టేట్స్‌ అనే కంపెనీలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. డ్రస్ పొట్టిగా వేసుకుందని ఓ యువతిని ఆఫీసు నుంచి ఇంటికి పంపించేశారు. ఇంగ్లాండ్‌లోని హాడ్డెస్‌డన్ హార్ట్‌ఫోర్డ్‌షెర్‌కు చెందిన లిల్లి క్యాటిల్ వార్ విక్ ఎస్టేట్స్ అనే కంపెనాలో జూనియర్ క్రెడిట్ కార్డ్ కంట్రోలర్‌గా పనిచేస్తోంది. రోజులాగే ఆఫీసుకు వెళ్లింది. ఆఫీసులో పనిచేసుకుంటుండగా హెచ్ ఆర్ టీమ్ సభ్యురాలు ఒకరు ఆమెను పిలిచి నీ స్కర్ట్ చాలా పొట్టిగా ఉంది. బాస్ నిన్ను ఇంటికి పంపమన్నారు అంటూ.. ఇంటికి వెళ్లి డ్రస్ మార్చుకుని రా అని ఆమెను పంపించేసింది. దీంతో తను చాలా అవమానంగా ఫీల్ అయింది. ఆ సమయంలో తనకు రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని లిల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అంతకు ముందు కూడా చాలాసార్లు తను అలాంటి డ్రస్ వేసుకుని ఆఫీసుకు వెళ్లానని అప్పుడు ఏమి అనని వాళ్లు ఇప్పుడు ఎందుకిలా అంటున్నారని ఆమె అన్నారు. చివరకు ఆవమానం జరిగిన దగ్గర తాను పనిచేయలేనని ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పింది.