త్వరలో అమేజాన్‌, యూట్యూబ్‌ల సంయుక్త సేవలు

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో వీడియో స్ట్రీమింగ్​ యాప్​లను తమ ఫ్లాట్​ఫాంపై పరస్పరం పంచుకునేందుకు గూగుల్​, అమేజాన్​ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. త్వరలోనే అమేజాన్​ ఫైర్​టీవీలో యూట్యూబ్​ను, క్రోమ్​కాస్ట్​లో అమేజాన్​ ప్రైమ్​ వీడియో యాప్​లు అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖ టెక్​ కంపెనీలు గూగుల్, అమేజాన్.. వీడియో స్ట్రీమింగ్​ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల త్వరలో ఒక సంస్థకు చెందిన వీడియో స్ట్రీమింగ్ యాప్​లు మరో సంస్థ ప్లాట్​ఫాంలో వీక్షించే వీలుకలగనుంది. ఈ సంయుక్త సేవలను కొద్ది నెలల్లో […]

త్వరలో అమేజాన్‌, యూట్యూబ్‌ల సంయుక్త సేవలు
TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 19, 2019 | 12:45 PM

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో వీడియో స్ట్రీమింగ్​ యాప్​లను తమ ఫ్లాట్​ఫాంపై పరస్పరం పంచుకునేందుకు గూగుల్​, అమేజాన్​ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. త్వరలోనే అమేజాన్​ ఫైర్​టీవీలో యూట్యూబ్​ను, క్రోమ్​కాస్ట్​లో అమేజాన్​ ప్రైమ్​ వీడియో యాప్​లు అందుబాటులోకి రానున్నాయి.

ప్రముఖ టెక్​ కంపెనీలు గూగుల్, అమేజాన్.. వీడియో స్ట్రీమింగ్​ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల త్వరలో ఒక సంస్థకు చెందిన వీడియో స్ట్రీమింగ్ యాప్​లు మరో సంస్థ ప్లాట్​ఫాంలో వీక్షించే వీలుకలగనుంది. ఈ సంయుక్త సేవలను కొద్ది నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇరు సంస్థలు ప్రకటించాయి. ఇప్పటి వరకు ఒక సంస్థ ప్లాట్​ఫాంను వినియోగించే వారికి మరో సంస్థ వీడియోలు చూసేందుకు వీలుండేది కాదు. తాజా ఒప్పందంతో ఆ సమస్య తీరనుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu