తొలి మహిళా రోబో న్యూస్ రీడర్ ‘జిన్ జియోమెంగ్’

బీజింగ్: ప్రపంచంలో తొలి రోబో న్యూస్ రీడర్ వార్తలు చదివింది. చైనాలో తొలి మహిళా రోబో న్యూస్ రీడర్ వార్తలు చదివి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఒక మహిళా యాంకర్‌లానే హావభావాలతో సహా ఆ రోబో వార్తలు చదివి ఆశ్యర్యపరిచింది. ఈ రోబోకు ‘జిన్ జియోమెంగ్’ అని పేరు పెట్టారు. ఈ రోబోకు పొడవాటి జుట్టు కాకుండా షార్ట్ హెయిర్ కట్ ఉంచారు. మెరూన్ కలర్ బట్టలు వేసుకుంది. చైనాకు చెందిన జింహ్వా అండ్ టెక్ అనే కంపెనీ […]

  • Vijay K
  • Publish Date - 6:04 pm, Mon, 4 March 19
తొలి మహిళా రోబో న్యూస్ రీడర్ 'జిన్ జియోమెంగ్'

బీజింగ్: ప్రపంచంలో తొలి రోబో న్యూస్ రీడర్ వార్తలు చదివింది. చైనాలో తొలి మహిళా రోబో న్యూస్ రీడర్ వార్తలు చదివి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఒక మహిళా యాంకర్‌లానే హావభావాలతో సహా ఆ రోబో వార్తలు చదివి ఆశ్యర్యపరిచింది. ఈ రోబోకు ‘జిన్ జియోమెంగ్’ అని పేరు పెట్టారు. ఈ రోబోకు పొడవాటి జుట్టు కాకుండా షార్ట్ హెయిర్ కట్ ఉంచారు. మెరూన్ కలర్ బట్టలు వేసుకుంది.

చైనాకు చెందిన జింహ్వా అండ్ టెక్ అనే కంపెనీ ఈ రోబోను తయారు చేసింది. గత నెలలోనే మహిళా రోబో ద్వారా వార్తలు చదివిస్తామని చైనాకు చెందిన జింహ్వా ప్రకటించింది. ఈ ప్రయోగం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు చైనా నిరూపించుకుంది. గతుడాది నవంబర్‌లో రెండు మగ రోబో న్యూస్ రీడర్లను జింహ్వా సంస్థ ప్రదర్శించింది.