Warning: ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడి.. ఆన్‌లైన్‌లో 800 కోట్ల పాస్‌వర్డ్‌లు లీక్..

Warning: హ్యాకర్ ఫోరం ఆన్‌లైన్‌లో అతిపెద్ద పాస్‌వర్డ్ సేకరణను లీక్ చేసింది. ఈ ఫోరం 100GB టెక్స్ట్ ఫైల్‌ను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది.

Warning: ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడి.. ఆన్‌లైన్‌లో 800 కోట్ల పాస్‌వర్డ్‌లు లీక్..
Password
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 10, 2021 | 8:00 AM

Warning: హ్యాకర్ ఫోరం ఆన్‌లైన్‌లో అతిపెద్ద పాస్‌వర్డ్ సేకరణను లీక్ చేసింది. ఈ ఫోరం 100GB టెక్స్ట్ ఫైల్‌ను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. ఇందులో సుమారు 8.4 బిలియన్ పాస్‌వర్డ్‌ల సేకరణ ఉంది. ఈ డేటా అంతా హ్యాకింగ్ ద్వారా సంగ్రహించినట్లు తెలుస్తోంది. ఈ పాస్‌వర్డ్ లీక్‌లో 6-20 అక్షరాల పాస్‌వర్డ్‌లు ఉంటాయి.

హ్యాకర్స్ పోస్ట్ చేసిన టెక్స్ట్ ఫైల్‌లో 82 బిలియన్ పాస్‌వర్డ్‌లు ఉన్నాయని అంతర్జాతీయ సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. ఈ పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేసిన ఫోరమ్.. దీనికి రాక్‌యూ 2021 అని పేరు పెట్టారు. రాక్ యూ డేటా లీక్ పేరుతో 2009 లోనూ భారీ లీక్ జరిగింది. ఆ సమయంలో సైబర్ నేరస్థులు విడ్జెట్లను తయారుచేసిన సంస్థ యొక్క సర్వర్‌పై దాడి చేశారు. ఈ సంస్థ మైస్పేస్ పేజీల వినియోగదారుల కోసం ఈ పనిని చేసేది. ఆ సమయంలో 32 మిలియన్ పాస్‌వర్డ్‌లు హ్యాక్ చేశారు. ఇప్పుడు ఏకంగా 82 మిలియన్ల పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేశారు.

రాక్ యూ-2021.. ఈ హ్యాకర్స్ ఫోరమ్.. హ్యాకింగ్‌ ద్వారా సేకరించిన పాస్‌వర్డ్‌ డేటాకు రాక్‌యూ డేటా లీక్ అని పేరు పెట్టారు. ఈ లీక్ అనేక ఇతర లీక్‌ల మాదిరిగానే ఉంటుంది. అంతకు ముందు సిఒఎంబి డేటా మాదిరిగా అనమాట. ఆ సమయంలో 3.2 బిలియన్ పాస్‌వర్డ్‌లు లీక్ అయ్యాయి. ఇక్కడ రాక్‌యూ 2021 కూడా పెద్దదని గుర్తించాలసిందే. ఎందుకంటే రాక్ యూ పేరిట ఈ హ్యాకర్స్ గ్రూప్ చాలా డేటాను లీక్ చేశారు.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆన్‌లైన్‌లో కేవలం 4.7 బిలియన్ల మంది మాత్రమే ఉండగా.. రాక్ యూ 2021 మాత్రం మొత్తం ప్రపంచ జనాభాకు రెండు రెట్ల పాస్‌వర్డలను లీక్ చేయడం ఆశ్చర్యకరం. ఏదేమైనా.. ఈ వ్యవహారంతో యూజర్ల భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. యూజర్లు తమ వ్యక్తిగత డేటా లీక్ అయిందో లేదో చెక్‌ చేయడంతో తమ పాస్‌వర్డ్స్ లీక్ అయ్యాయా? అనేది చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీ పాస్‌వర్డ్ హ్యాకింగ్‌కు గురైనట్లు గుర్తిస్తే.. వెంటనే పాస్‌వర్డ్‌లను ఛేంజ్ చేయడం ఉత్తమం అని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

Also read:

Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్‏లలో ఇవాళ సిల్వర్ రేట్స్ ఇలా..