రోదసిలో సిమెంట్! ఇల్లు కట్టొచ్చా..?

రోదసిలో సిమెంట్! ఇల్లు కట్టొచ్చా..?

గత కొన్నేళ్లుగా.. రోదసిపై పలు రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు సైన్‌టిస్టులు. ఈ సందర్భంలో.. భాగాంగా.. వాషింగ్టన్‌కు చెందిన వ్యోమగాములు మరో వినూత్న ఐడియాకి తెరతీశారు. సాధారణంగా.. మనం భూమ్మీద.. సిమెంట్, ఇసుక తదితర వాటిని కలిసి కాంక్రీటును తయారు చేసి.. ఇల్లును కడతారు. అలాంటి పని రోదసి పైన చేస్తే..! మాములుగానే.. రోదసిలోకి వెళ్లిన వ్యోమగాములు గాలిలో తేలుతూ ఉంటారు. మరి ఈ కాంక్రీటు ఎలా ఉంటుంది.. ఇదే ఇప్పుడు ఆసక్తిర విషయంగా మారింది. గత కొన్ని […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 13, 2019 | 9:33 AM

గత కొన్నేళ్లుగా.. రోదసిపై పలు రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు సైన్‌టిస్టులు. ఈ సందర్భంలో.. భాగాంగా.. వాషింగ్టన్‌కు చెందిన వ్యోమగాములు మరో వినూత్న ఐడియాకి తెరతీశారు. సాధారణంగా.. మనం భూమ్మీద.. సిమెంట్, ఇసుక తదితర వాటిని కలిసి కాంక్రీటును తయారు చేసి.. ఇల్లును కడతారు. అలాంటి పని రోదసి పైన చేస్తే..! మాములుగానే.. రోదసిలోకి వెళ్లిన వ్యోమగాములు గాలిలో తేలుతూ ఉంటారు. మరి ఈ కాంక్రీటు ఎలా ఉంటుంది.. ఇదే ఇప్పుడు ఆసక్తిర విషయంగా మారింది.

గత కొన్ని సంవత్సరాల నుంచీ.. చంద్రుడిపైనా, కుజ గ్రహం మీద ఇల్లులు కట్టుకోవచ్చని.. అక్కడ మనం నివసించవచ్చని.. శాస్వ తీసుకునే అవకాశం కూడా ఉందని.. శాస్త్రవేత్తలు ఇదివరకు చెప్పారు. పలు రకాల పంటలు కూడా పండుతాయని.. మన శాస్త్రవేత్తలు తేల్చేశారు. అలాగే.. అక్కడి వెళ్లడానికి ఇప్పటికే పలు ప్రయాత్నాలు చేశారు. ఎన్నో శాటిలైట్లను, రోవర్లు పైకి పంపించిన విషయం కూడా తెలుసు. మనిషి బతకాలంటే.. ఆహారం, నీరు, గాలి ముందు అవసరం. ఈ నేపథ్యంలో ముందు గాలిని టెస్ట్ చేసి పాస్‌ అయ్యారు. అలాగే.. రోదసిలో నీరు కూడా ఉందని చెప్పారు. ఆతరువాత మనం తినే పలు ఆహారాలను పైన టెస్ట్‌ చేస్తూ ఉన్నారు. ముందు కొన్ని ఆకు కూరలను టెస్ట్‌ చేశారు. తాజాగా.. కొన్ని రోజుల ముందు.. ఎండు మిరపకాయలను టెస్ట్ చేసి సక్సెస్ అయ్యారు.

Why Astronauts Are Mixing Cement Aboard the International Space Station

అయితే.. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రోదసిలో మనం ఉండొచ్చని శాస్త్రవేత్తలు బల్ల గుద్ది చెబుతున్నారు. కానీ.. ఉండటానికి ఏదో ఒక ఆధారం కావాలి కదా.. అందుకే.. దీనికి సంబంధించి.. ఇప్పుడు.. రోదసీలో సిమెంట్‌ తయారు చేస్తే ఎలా ఉంటుంది..? రోదసీలో ఓ ఇల్లు, అందులో మనం.. సూపర్ కదా..!

అందుకే రోదసిలో సిమెంట్ టెస్ట్ చేశారు. దీనివల్ల భవిష్యత్తులో విశ్వంలోని హానికారక రేడియోధార్మికత, అసాధారణ ఉష్ణోగ్రతల నుంచి మానవులను రక్షించడానికి వీలవుతుందని అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ తెలిపింది. ఈ తాజా ప్రయోగం ద్వారా ఈ ప్రక్రియకు సంబంధించిన రసాయన తీరుతెన్నులు.. గురుత్వాకర్షణ వాతావరణం వల్ల ఈ కాంక్రీటు వల్ల.. ఏమైనా నిర్మాణాలు చేపట్టవచ్చా..? చేస్తే.. అవి ధృఢంగా ఉంటాయో.. లేదా.. అని శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశారు.

ఈ సిమెంట్‌ను రోదసిలో దొరికే వాటర్‌తోనూ.. భూమ్మీద దొరికే వాటర్‌తోనూ.. విడివిడిగా కలిపి చూస్తున్నారు. అయితే.. రోదసిపైన తయారు చేసిన ఈ మిశ్రమం కాస్త గుల్లగా.. ఉన్నట్టు వారి పరిశోధనలో తేలింది. భూమి మీద ఉన్న వాటర్‌తో సిమెంట్ కాస్త ధృఢంగా ఉన్నట్లు తెలిపారు. అయితే.. మరికొద్ది రోజుల్లోనో.. రోదసిలో ఇల్లులు కట్టుకోవచ్చన్నమాట.

Why Astronauts Are Mixing Cement Aboard the International Space Station

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu