Whatsapp: యూజర్ల కోసం వాట్సాప్‌ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. ఇకపై గూగుల్‌ డ్రైవ్‌ వాడాల్సిన అవసరం లేదు.

నిత్యం ఏదో ఒక కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటూ వస్తోంది వాట్సాప్‌. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ వస్తోన్న మెసేజింగ్ యాప్‌ దిగ్గజం తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఛాట్‌ ట్రాన్స్‌ఫర్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది...

Whatsapp: యూజర్ల కోసం వాట్సాప్‌ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. ఇకపై గూగుల్‌ డ్రైవ్‌ వాడాల్సిన అవసరం లేదు.
Whatsapp
Follow us

|

Updated on: Jan 09, 2023 | 7:00 AM

నిత్యం ఏదో ఒక కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటూ వస్తోంది వాట్సాప్‌. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ వస్తోన్న మెసేజింగ్ యాప్‌ దిగ్గజం తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఛాట్‌ ట్రాన్స్‌ఫర్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఆండ్రాయిడ్ డివైజ్‌ నుంచి వచ్చిన డేటాను మరో లోకల్‌ నెట్‌వర్క్‌తో పని చేస్తున్న డివైజ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. టెస్టింగ్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

వాట్సాప్‌ బీటా ఇన్ఫో వర్గాల ప్రకారం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్ ద్వారా యూజర్లు తమ ఛాట్‌ హిస్టరీని ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. వాట్సాప్‌ చాట్‌ను బ్యాకప్‌ చేసుకోవడానికి ఇకపై గూగుల్ డ్రైవ్‌ వాడాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా యూజ‌ర్లు ఇక నుంచి గూగుల్ డ్రైవ్ వాడాల్సిన అవ‌స‌రం లేకుండా చేస్తుందిన ఒక డివైజ్ నుంచి మ‌రో డివైజ్‌కు ఛాట్ ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌నుకుంటే వారు బ్యాక‌ప్ కోసం క్లౌడ్ స‌ర్వీసుల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌ద‌ని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.

ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు తమ డేటాను సులభంగా బ్యాకప్‌ పొందొచ్చు. ఇక వాట్సాప్‌ అంతకు ముందు ప్రాక్సీ సపోర్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాట్సాప్‌ తీసుకొచ్చిన ఈ నిర్ణయంతో ఏ సమయంలో అయినా వాట్సాప్‌ కనెక్షన్‌ బ్లాక్‌ అయితే, దాని పునరుద్ధరించుకునేందుకు యూజర్లకు అవకాశం కల్పించారు. పలు రకాల సర్వర్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేసుందుకు ఈ ప్రాక్సీ ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..