Alert: కస్టమర్లకు అలర్ట్.. ఈరోజు నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎందుకంటే..

అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన మేసేజింగ్ ప్లాట్ ఫారమ్ వాట్సాప్ (Whats App). మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఇప్పుడు.

Alert: కస్టమర్లకు అలర్ట్.. ఈరోజు నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎందుకంటే..
Whatsapp
Follow us

|

Updated on: Mar 31, 2022 | 8:42 AM

అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన మేసేజింగ్ ప్లాట్ ఫారమ్ వాట్సాప్ (Whats App). మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఇప్పుడు.. గూగుల్ మాదిరిగానే ప్రతిఒక్కరి దినచర్యలో భాగమైపోయింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని స్మార్ట్‏ఫోన్లలో వాట్సాప్ పనిచేస్తుంది. అయితే ఇటీవల పలు సాఫ్ట్‌వేర్ వెర్షన్స్‏లలో మద్దతు లేని ఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివేసింది మెటా. తాజాగా మరో జాబితాను వాట్సాప్‌ యాజమాన్య సంస్థ మెటా విడుదల చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌, కాయ్‌ ఓఎస్‌ల్లోని కొన్ని వెర్షన్‌లో వాట్సాప్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. మార్చి 31 నుంచి ఆ ఫోన్‌ మోడల్స్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయని కంపెనీ తెలిపింది.

ఆండ్రాయిడ్‌ 4.0, అంతకంటే తక్కువ వెర్షన్‌లో ఇక వాట్సాప్‌ పనిచేయదు. అలాగే ఐఓఎస్‌ 10 అంతకంటే పై వెర్షన్‌లోని మోడల్స్‌లో మాత్రమే వాట్సాప్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. కాయ్‌ 2.5 వెర్షన్‌ కంటే తక్కువగా ఉన్న మోడళ్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు కంపెనీ కొన్ని ఫోన్‌ మోడళ్ల పేర్లతో జాబితాను విడుదల చేసింది. అందులో ఆండ్రాయిడ్ ఫోన్లలో శాంసంగ్‌, ఎల్‌జీ వంటి ప్రముఖ బ్రాండ్‌లతోపాటు షావోమీ, హువావే వంటి మోడల్స్‌ కూడా ఉన్నాయి.

శాంసంగ్‌: శాంసంగ్‌ కంపెనీ గతంలో విడుదల చేసిన గెలాక్సీ ట్రెండ్‌ లైట్‌, గెలాక్సీ ఎస్3 మినీ, గెలాక్సీ ఎక్స్‌కవర్‌ 2, గెలాక్సీ కోర్‌ వంటి మోడల్స్‌లో మార్చి 31 తర్వాత వాట్సాప్‌ పనిచేయదు.

ఎల్‌జీ: ఎల్‌జీ కంపెనీకి చెందిన ఆప్టిమస్‌ సిరీస్‌లో ఎఫ్‌3, ఎఫ్5, ఎఫ్‌6, ఎఫ్‌7, ఆప్టిమస్‌ ఎల్‌3 II డ్యూయల్‌, ఎల్‌4 II డ్యూయల్, ఆప్టిమస్‌ ఎల్ II, ఎఫ్‌5 II, ఎఫ్‌5 II డ్యూయల్‌, ఎఫ్‌7 II, ఎఫ్‌7 II డ్యూయల్‌, ఎల్‌జీ ఎన్‌ఆక్ట్‌, ఆప్టిమస్‌ ఎల్‌2 II, ఆప్టిమస్‌ ఎఫ్‌3క్యూ మోడల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.

మోటోరోలా: మోటోరోలా డ్రాయిడ్‌ రాజర్‌ మోడల్స్‌ అమ్మకాలు భారత్‌లో నిలిచిపోయాయి. అయినప్పటికీ ఎవరైనా ఇంకా ఈ మోడల్స్‌ ఉపయోగిస్తున్నట్లయితే ఆయా మోడల్స్‌లో ఇక వాట్సాప్ పనిచేయదు.

షావోమీ: షావోమి కంపెనీ తీసుకొచ్చిన హంగ్ఎంఐ, ఎంఐ2ఏ, రెడ్‌మీ నోట్‌ 4జీ, హంగ్ఎంజీ 1ఎస్‌ వంటి మోడళ్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి.

హువావే: హువావే గతంలో విడుదల చేసిన అసెండ్‌ డీ, క్వాడ్‌ ఎక్స్‌ఎల్‌, అసెండ్‌ డీ1, క్వాడ్‌ ఎక్స్‌ఎల్‌, అసెండ్‌ పీ1 ఎస్‌ లాంటి మోడళ్లలోనూ వాట్సాప్‌ పనిచేయదని వాట్సప్‌ యాజమాన్య సంస్థ మెటా వెల్లడించింది.

Also Read: Fact Check: జక్కన్నను అన్‌ఫాలో చేసిన అలియా.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫొటోలు డిలీట్‌.. ఇందులో నిజమెంతంటే..

Pakka Commercial: గోపీచంద్‌ పక్కా కమర్షియల్‌ వచ్చేది అప్పుడే.. రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మూవీ మేకర్స్‌..

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించినందుకు గర్వంగా ఉంది.. తన కెరీర్‌ గురించి ఎన్టీఆర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. మరింత ఆలస్యం కానున్న సలార్‌ విడుదల.. కారణం ఇదేనా.?

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!