WhatsApp Web: వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక వెబ్‌లోనూ ఈ ప్రైవసీ ఫీచర్‌..!

ఇన్‌స్టంట్-మెసేజింగ్ యాప్‌లోని ఈ సరికొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ప్రొఫైల్ ఫోటో, స్టేటస్‌ను ఎవరు చూడాలో..

WhatsApp Web: వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక వెబ్‌లోనూ ఈ ప్రైవసీ ఫీచర్‌..!
Follow us

|

Updated on: Nov 22, 2021 | 1:26 PM

WhatsApp Web: ఈ నెల ప్రారంభంలో వాట్సప్ (WhatsApp) వినియోగదారులకు మరింత రక్షణ కోసం కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఫేస్‌బుక్ యాజమాన్యంలో ఉన్న వాట్సప్.. “మై కాంటాక్ట్స్ ఎక్సప్ట్” అనే ఫీచర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతానికి, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు WhatsApp బీటా కోసం ఇప్పటికే అందుబాటులో ఉంది. WABetaInfo తాజా నివేదిక ప్రకారం, వాట్సప్ ఇతర వినియోగదారులకు కూడా ఈ ఫీచర్‌ను అందించేందుకు సిద్ధమైంది. కొత్త వెర్షన్ 2.2146.5తో ఈ ఫీచర్‌ను తాజాగా వెబ్, డెస్క్‌టాప్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందని నివేదిక వెల్లడించింది.

అసలు ఈ ఫీచర్ ఏంటీ..? ఇన్‌స్టంట్-మెసేజింగ్ యాప్‌లోని ఈ సరికొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ప్రొఫైల్ ఫోటో, స్టేటస్‌ను ఎవరు చూడాలో నిర్ణయించుకోవచ్చు. దీంతో యూజర్లకు సంబంధించిన డేటాకు మరింత రక్షణ దొరకనుందని కంపెనీ వెల్లడించింది. ప్రైవసీ సెట్టింగ్‌ల కింద ఈ ఫీచర్‌ని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. యాప్‌లో ఇప్పటికే మూడు ఆఫ్షన్‌లను అందించింది. కొత్త ఫీచర్‌తో, వినియోగదారుల ప్రొఫైల్ ఫోటో, స్టేటస్‌లను వేరే యూజర్లు చూడకుండా నియంత్రించుకోవచ్చు.

ఇటీవల, వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త షార్ట్‌కట్‌ను కూడా విడుదల చేసింది. వీటితో యూజర్‌లు ఎవరైనా ఇతరులు షేర్ చేసిన స్టేటస్ అప్‌డేట్‌లను చూస్తున్నప్పుడు వీడియో కాల్‌ని ప్రారంభించేందుకు అనుమతిస్తుంది. ఈ షార్ట్‌కట్స్‌ను యాక్సెస్ చేయడానికి స్టేటస్ అప్‌డేట్‌ను చూస్తున్నప్పుడు స్క్రీన్ కుడివైపు ఎగువ భాగాన ఉన్న మూడు చుక్కలను నొక్కాలి. ఈ మెనులో “వీడియో కాల్” ఎంపికను యాక్సస్‌ చేసుకుని ఓకేసారి రెండు ఫీచర్లను వాడుకోవచ్చు.

ఇంతకు ముందు ఈ ఆఫ్షన్‌తో కేవలం వాయిస్ కాల్స్‌ను మాత్రమే చేసుకునే వీలుండేది. కొత్త అప్‌డేట్‌తో వీడియోకాల్‌ కూడా చేసుకునే అవకాశాన్ని అందించింది. ఇప్పటికే 2.21.23 బీటా అప్‌డేట్‌ని కలిగి ఉన్న యూజర్లు వాయిస్ కాల్ షార్ట్‌కట్‌ను పొందవచ్చు.

Also Read: Shoaib Akhtar: నేను పరుగెత్తే రోజులు ముగిశాయి: భావోద్వేగాన్ని అభిమానులతో పంచుకున్న రావల్పిండి ఎక్స్‌ప్రెస్

IND vs NZ: ఈ ఫొటోలో రోహిత్‌ పక్కన ఉన్నది ఎవరో తెలుసా.. 15 ఏళ్ల నాటి ఫొటో షేర్ చేసిన టీమిండియా బౌలర్?

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..