WhatsApp: వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ‘థీమ్‌ చాట్’ పేరుతో..

థీమ్‌ చాట్‌ పేరుతో వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు అనేక రకాల థీమ్‌లను తమ చాట్‌కు యాడ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అలాగే యూజర్లు ఈ థీమ్‌కు తమకు నచ్చిన కలర్స్‌తో ఫిల్ చేసుకోవచ్చు కూడా. యూజర్లకు మరింత మెరుగైన, ఆసక్తికరమనై ఛాటింగ్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా..

WhatsApp: వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. 'థీమ్‌ చాట్' పేరుతో..
Whatsapp
Follow us

|

Updated on: Sep 22, 2024 | 3:42 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్స్‌కు ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏకైక మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌. రోజురోజుకీ యూజర్ల సంఖ్యను పెంచుకూంటూ పోతోందీ యాప్‌. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే ఈ యాప్‌కు ఇంతటి క్రేజ్‌ దక్కింది. ఇప్పటికే భద్రతతో పాటు యూజర్ ఇంటర్‌ఫేస్‌లో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.

థీమ్‌ చాట్‌ పేరుతో వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు అనేక రకాల థీమ్‌లను తమ చాట్‌కు యాడ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అలాగే యూజర్లు ఈ థీమ్‌కు తమకు నచ్చిన కలర్స్‌తో ఫిల్ చేసుకోవచ్చు కూడా. యూజర్లకు మరింత మెరుగైన, ఆసక్తికరమనై ఛాటింగ్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ కొత్త ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ విషయాన్ని ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో షేర్‌ చేసింది. త్వరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి రానుందని తెలిపింది. సంబంధిత స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకుంది. మొదట టెస్టింగ్‌లో భాగంగా కొంత మందికి అందుబాటులోకి తీసుకొచ్చి. ఆ తర్వాత అందరు యూజర్లకు ఈ ఫీచర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.

సాధారణంగా ఇన్‌స్టాలో మనం ఏదైనా స్టోరీ పోస్ట్ చేసే సమయంలో సదరు పోస్ట్‌ను ఎవరికైనా ‘@’ సహాయంతో ట్యాగ్ చేస్తుంటాం. దీంతో మనం ట్యాగ్ చేసిన వారికి నోటిఫికేషన్‌ వెళ్తుంది. అయితే ఇప్పుడీ ఫీచర్‌ను వాట్సాప్‌లో కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపై మీరు వాట్సాప్‌లో స్టేటస్‌ పోస్ట్ చేసే సమయంలో మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వ్యక్తులను ట్యాగ్ చేయొచ్చు. దీంతో వారికి నోటిఫికేషన్‌ వెళ్తుంది. అంటే మీరు పోస్ట్ చేసిన స్టేటస్‌ వారి కోసమే అని చెప్పొచ్చన్నమాట. అయితే మీరు ఏ వ్యక్తికి ట్యాగ్ చేశారన్న విషయం మిగతా వారికి తెలియకుండా ఉండేలా ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..