ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు చాలా మంది ఫోన్‌లలో అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ ద్వారానే రకరకాల పనులు చేసుకుంటున్నారు. ఎంతో మంది ఉదయం నుంచి రాత్రి వరకు వాట్సాప్‌లో మునిగితేలున్నారు. ప్రతి రోజు చాట్‌లు, ఫోటోలు, వీడియోలను షేర్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో స్టోరేజీ పెద్ద సమస్యగా మారుతుంది. ఫోటోలు, వీడియోల కోసం స్టోరేజీ తప్పనిసరి అవసరం. మరి స్టోరేజీ లేకపోతే ఏం చేయాలి? దీని కోసం మీరు పెద్దగా చేయవలసిన అవసరం లేదు. ట్రిక్స్‌ను ఉపయోగిస్తే సమస్య ఉండదు.
ఈ దశలను అనుసరించండి:
చాట్ చరిత్రను తొలగించండి:
WhatsApp స్టోరేజీ క్లియర్ చేయడానికి మీరు చాట్ హిస్టరీని తొలగించవచ్చు. దీని కోసం సంబంధిత చాట్‌ను తెరవండి. పైన ఉన్న మూడు చుక్కలు లేదా చాట్‌లోని సెట్టింగ్‌ల ఎంపికపై క్లిక్ చేయండి. ‘క్లియర్ చాట్ హిస్టరీ’ ఆప్షన్ కనిపిస్తుంది. చాట్ చరిత్రను తొలగించండి. చాలా స్థలం గ్రూప్ చాట్‌ల ద్వారా ఆక్రమించి ఉంటుంది. మీరు మీ ఆఫీస్ గ్రూప్, ఫ్రెండ్స్ గ్రూప్ చాట్‌లను ఎప్పటికప్పుడు తొలగించవచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి