WhatsApp: మేలో 19 లక్షల ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్.. మీరు కూడా ఇలా చేస్తే.. వేటు పడే ఛాన్స్..

ప్రతి నెలలాగే మే నెల యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌ను వాట్సాప్ విడుదల చేసింది. ఆ నెలలో మొత్తం 19 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించినట్లు పేర్కొంది.

WhatsApp: మేలో 19 లక్షల ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్.. మీరు కూడా ఇలా చేస్తే.. వేటు పడే ఛాన్స్..
Venkata Chari

|

Jul 02, 2022 | 12:46 PM

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ మే నెలలో ఎంతోమంది భారతీయులకు షాక్ ఇచ్చింది. దాదాపు 19 లక్షల ఖాతాలను నిషేధించింది. యాప్ ప్రతి నెలా కొత్త ఐటీ నిబంధనల మేరకు కొన్ని నివేదికలను విడుదల చేస్తోంది. తాజాగా విడుదల చేసిన మే నెల నివేదికలో తమ ప్లాట్‌ఫారమ్‌లో 19 లక్షలకు పైగా భారతీయ ఖాతాలను నిషేధించినట్లు యాప్ పేర్కొంది. యాప్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకుగాను ఈ ఖాతాలు నిషేధించినట్లు తెలిపింది. కొత్త నివేదికలో 1 మే 2022 నుంచి 31 మే 2022 వరకు డేటా అందుబాటులో ఉంచింది.

అసలు కారణం ఏంటంటే?

ఈ విషయంపై వాట్సాప్ ప్రతినిధులు మాట్లాడుతూ, ‘ఐటీ రూల్స్ 2021 ప్రకారం, మే 2022 కోసం మేం తాజా నివేదికను విడుదల చేశాం. యూజర్ల భద్రతా నివేదికలో వినియోగదారుల ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల వివరాలు అందించాం’ అని తెలిపారు.

దీనితో పాటు, ప్లాట్‌ఫారమ్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి వాట్సాప్ కూడా అనేక చర్యలు తీసుకుంది. గత నెలలో అంటే మేలో, యాప్ 19 లక్షలకు పైగా వాట్సాప్ ఖాతాలను నిషేధించింది. వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించడం ఇదే మొదటిసారి కాదు.

మీరు కూడా ఇలా చేస్తే.. బ్యాన్ అయ్యే అవకాశం..

కంపెనీ పాలసీలు, మార్గదర్శకాలను పాటించని యూజర్లను తమ ప్లాట్‌ఫారమ్‌పై నిషేధిస్తున్నట్లు వాట్సాప్ ఇప్పటికే స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు లేదా ధృవీకరించని సందేశాలను ఫార్వార్డ్ చేసే వినియోగదారుల ఖాతాలను యాప్ నిషేధిస్తుంది.

ఇటువంటి వాటిని నిరోధించడానికి యాప్ అనేక ఇతర చర్యలను కూడా తీసుకుంటుంది. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అనేకసార్లు ఫార్వార్డ్ చేసిన సందేశాలను కూడా యూజర్లకు గుర్తు చేస్తుంది. ఇదుకోసం మల్టిపుల్ టైమ్స్ ఫార్వర్డ్ అనే లేబుల్‌ని అందించారు.

బ్యాన్‌పై అప్పీల్ చేసే అవకాశం..

ఇవి కూడా చదవండి

ఇటీవలి నివేదికల ప్రకారం, త్వరలో వినియోగదారులు వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ను పొందనున్నారు. దీనితో బ్యాన్ అయిన ఖాతాలను అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. నిషేధాన్ని తొలగించమని వాట్సాప్‌ను కోరవచ్చు. యూజర్ల ఖాతా పొరపాటున నిషేధిస్తే, వారి ఖాతా వెంటనే యాక్టివ్ అవ్వనుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu