Cyber Insurance: సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకున్నారా..? ఈ ఒక్క పాలసీ తీసుకుంటే మీరు సేఫ్

ఇటీవల సైబర్ నేరాల బారిన పడి ప్రజలు లక్షలు లక్షలు పొగోట్టుకుంటున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్మును ఒక్క నిమిషంలోనే సైబర్ క్రిమినల్స్ దోచేేస్తున్నారు. దీంతో మార్కెట్లో సైబర్ ఇన్యూరెన్స్ పాలసీలు వచ్చాయి. వీటిని మీరు తీసుకోవడం వల్ల డబ్బులు పొగోట్టుకున్నప్పుడు ఆర్ధికంగా ఇబ్బందులు నుంచి బయటపడవచ్చు.

Cyber Insurance: సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకున్నారా..? ఈ ఒక్క పాలసీ తీసుకుంటే మీరు సేఫ్
Cyber Insurance

Updated on: Dec 09, 2025 | 4:11 PM

హెల్త్ ఇన్యూరెన్స్, టర్న్ ఇన్యూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వంటివి అందరూ వినే ఉంటారు. కానీ సైబర్ ఇన్స్యూరెన్స్ గురించి మీకు తెలుసా..? అవును సైబర్ దాడుల నుంచి మిమ్మల్ని కాపాడేందుకు చాలా బీమా కంపెనీలు సైబర్ ఇన్యూరెన్స్ పాలసీలు కూడా అందుబాటులోకి తెచ్చాయి. ఈ ఇన్యూరెన్స్ మీ కోసం వ్యక్తిగతంగా తీసుకోవచ్చు లేదా ఫ్యామిలీ మొత్తానికి కలిపి తీసుకోవచ్చు. సైబర్ దాడుల బారిన పడి ఆర్ధికంగా డబ్బులు పొగోట్టుకున్నప్పుడు ఈ ఇన్యూరెన్స్ మీకు, మీ కుటుంబసభ్యులకు అండగా ఉంటుంది. ఇటీవల సైబర్ దాడులు ఎక్కువైన క్రమంలో కంపెనీలు వీటి గురించి విస్తృతంగా ప్రచారం కూడా చేస్తు్న్నాయి. అసలు ఈ సైబర్ ఇన్యూరెన్స్ ఎలా తీసుకోవాలి..? ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? అనే విషయాలు తెలుసుకుందాం.

సైబర్ ఇన్యూరెన్స్ ఎందుకు తీసుకోవాలి..?

ఇప్పట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతీఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తు్న్నారు. అందరూ సోషల్ మీడియా అకౌంట్లను కలిగి ఉన్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ సిటిజన్లు, పిల్లలు తమకు తెలియకుండా వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకునే అవకాశముంది. ఇలాంటి సయయంలో పర్చువల్ బెదిరింపులను కూడా ఎదుర్కొనే ప్రమాదముంది. ఇలాంటి సమయంలో డబ్బులను కూడా పొగోట్టుకుంటారు. ఈ పరిస్థితుల్లో కుటుంబాన్ని రక్షించుకోవడానికి సైబర్ ఇన్యూరెన్స్ ఉపయోగపడుతుంది. కేవలం కుటుంబాలే కాకుండా వ్యాపార సంస్థలు కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు.

వేటిని కవర్ చేస్తుంది..?

ఆన్‌లైన్ ఆర్ధిక మోసాలు, గుర్తింపు దొంగతనం, డేటా ఉల్లంఘనలు, అకౌంట్ హ్యాకింగ్, పిషింగ్ స్కామ్‌లు, మాల్వేర్ దాడులు, సిమ్ స్వాప్ మోసం, డిజిటల్ వాలెట్లు లేదా సోషల్ మీడియా అకౌంట్ల దుర్వినియోగం వంటి వాటి ఘటనలను సైబర్ ఇన్యూరెన్స్‌లో కవరేజీ వస్తోంది. ఇటువంటి మోసాల బారిన పడినప్పుడు మీరు డబ్బులు తిరిగి పొందేందుకు, అకౌంట్లను తిరిగి పునరుద్దరించడానికి, చట్టపరమైన సహాయం పొందటానికి సహాయపడుతుంది.

ఎలా క్లెయిమ్ చేసుకోవాలి..?

మీరు సైబర్ మోసాల బారిన పడినప్పుడు క్లెయిమ్ పొందవచ్చు. ముందుగా మీరు సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత 24 నుంచి 478 గంటల్లోపు బీమా సంస్థకు సమాచారం అందించాలి. దీంతో బీమా సంస్థలు మీ పేరు మీద జరిగే అనధికార లావాదేవీలను అడ్డుకుంటుంది. దీని వల్ల సైబర్ నేరగాళ్లు తదుపరి ట్రాన్సాక్షన్లు చేయకుండా నిరోధిస్తారు. ఇటీవల సీనియర్ సిటిజన్లు ఎక్కువగా సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకుని మోసపోతారు. అలాగే స్మార్ట్‌ఫోన్ గురించి తెలియని పిల్లలు కూడా వారి బారిన పడుతన్నారు. దీంతో కుటుంబం మొత్తానికి కలిపి సైబర్ ఇన్యూరెన్స్ తీసుకుంటే మీకు భద్రతగా ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.