వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్లు.. అవేంటంటే?

ప్ర‌ముఖ మెసేజింగ్ అప్లికేష‌న్ వాట్సాప్ స‌రికొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకొస్తోంది. ఎప్పటికప్పుడు తన వినియోగదారులని దృష్టిలో పెట్టుకుని కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తూనే ఉంటుంది వాట్సాప్. డెస్క్ టాప్ వెర్ష‌న్‌లో డార్క్ మోడ్ స‌హా, ప‌లు ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌కు స‌రికొత్త అనుభూతిని..

వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్లు.. అవేంటంటే?
Follow us

| Edited By:

Updated on: Aug 27, 2020 | 5:11 PM

ప్ర‌ముఖ మెసేజింగ్ అప్లికేష‌న్ వాట్సాప్ స‌రికొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకొస్తోంది. ఎప్పటికప్పుడు తన వినియోగదారులని దృష్టిలో పెట్టుకుని కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తూనే ఉంటుంది వాట్సాప్. డెస్క్ టాప్ వెర్ష‌న్‌లో డార్క్ మోడ్ స‌హా, ప‌లు ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌కు స‌రికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధ‌మ‌వుతోంది. తాజాగా యూజ‌ర్స్ కోసం మ‌రిన్ని మెరుగైన ఫీచ‌ర్ల‌ను అందుబాటుల‌కి తీసుకొస్తోంది. వీటిలో కొన్ని ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి రాగా, మ‌రొకొన్ని బీటా యూర్ల‌కు వినియోగించేందుకు వీలుంది.

వాట్సాప్ యూజ‌ర్లు చాలా కాలంగా ఎదురు చూస్తు్న ఫీచ‌ర్ల‌లో మ‌ల్టీ డివైజ్ లాంగిన్ ఒక‌టి. ఒకేసారి ఒక‌టి కంటే ఎక్కువ డివైజ్‌ల‌లో లాగిన్ అవ్వాల‌నుకునే వారికి ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్లో లాగిన్ అయ్యేందుకు మాత్ర‌మే అవ‌కాశాం ఉంది. ఇక మ‌రో ఫీచ‌ర్ ఏంటంటే.. ఒకే సారి 50 మందితో వీడియో కాల్‌. గూగుల్ మీట్, జూమ్ యాప్‌లో త‌ర‌హాలో వాట్సాప్ కూడా ఒక వీడియో కాల్‌లో ఒకేసారి 50 మందితో మాట్లాడుకునే ఫీచ‌ర్‌ని అందుబాటులోకి తీసుకురానుంది.

ఎమోజీల‌తో త‌మ భావాల‌ను వ్య‌క్త ప‌రిచే వారి కోసం కొత్త‌గా 138 ఎమోజీల‌ను వాట్సాప్ తీసుకొస్తోంది. ప్ర‌స్తుతం ఇవి వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్ష‌న్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో చెఫ్‌, ఫార్మ‌ర్, పెయింట్‌తో ఇత‌ర వృత్తుల‌కు చెంద‌ని ఎమోజీల‌ను ఇస్తున్నారు. ఇక చాలా మంది ఒక‌టి కంటే ఎక్కువ గ్రూపుల్లో స‌భ్యులుగా ఉంటారు. వాటిలో కొన్ని మ‌నం త‌రుచూ ఉప‌యోగించేవి ఉంటే.. మ‌రికొన్నింటిలో యాక్టీవ్‌గ ఉండ‌లేం. అటువంటి వాటిని ప‌ర్మినెంట్‌గా మ్యూట్ చేసే ఆప్ష‌న్ రాబోతుంది. అలాగే క్యూఆర్ కోడ్‌, డార్క్ మోడ్, గ్రూప్ వీడియో కాలింగ్ వంటి వాటిని కూడా తీసుకొస్తుంది వాట్సాప్‌.

Read More:

ఆదిపురుష్ ప్రాజెక్ట్: ఇంటివ‌ద్ద‌నే విలువిద్య నేర్చుకుంటోన్న ప్ర‌భాస్‌?

కోమాలోనే ప్ర‌ణ‌బ్.. కిడ్నీ స‌మ‌స్య‌లు కూడా తలెత్తాయిః ఆస్ప‌త్రి వైద్యులు

క‌రోనా టెస్టుల ధ‌ర‌ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం

బ్రేకింగ్ః గాంధీ ఆస్ప‌త్రి నుంచి న‌లుగురు ఖైదీలు ప‌రారీ

మొత్తానికి ‘బీబీ’ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చిన నందు