ఎలక్ట్రిక్  వాహనాల వినియోగంలో యూపీ ముందంజ!

ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి 2015లో పార్లమెంటు ఆమోదం తెలపడంతో దేశంలో 4 లక్షల ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీ వాహనాలు రిజిస్టరు అయ్యాయి. ఎలక్ట్రిక్ కార్ల వినియోగంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ముందున్నాయి. యూపీలో 1.39 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగిస్తూ దేశంలోనే ఆ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో దేశంలోనే ముందుందని కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో ప్రకటించారు. ఢిల్లీలో 75,600 ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో రెండో స్థానంలో నిలిచిందని మంత్రి గడ్కరీ వెల్లడించారు. […]

ఎలక్ట్రిక్  వాహనాల వినియోగంలో యూపీ ముందంజ!
Follow us

| Edited By:

Updated on: Jul 15, 2019 | 8:35 PM

ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి 2015లో పార్లమెంటు ఆమోదం తెలపడంతో దేశంలో 4 లక్షల ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీ వాహనాలు రిజిస్టరు అయ్యాయి. ఎలక్ట్రిక్ కార్ల వినియోగంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ముందున్నాయి. యూపీలో 1.39 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగిస్తూ దేశంలోనే ఆ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో దేశంలోనే ముందుందని కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో ప్రకటించారు. ఢిల్లీలో 75,600 ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో రెండో స్థానంలో నిలిచిందని మంత్రి గడ్కరీ వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం ఈ వాహనాల వినియోగంలో మూడోస్థానంలో ఉందని, మహారాష్ట్ర నాలుగో స్థానంలో ఉదని మంత్రి తెలిపారు. దేశంలో పర్యావరణానికి హాని చేయని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపునిచ్చామని మంత్రి వివరించారు.